శ్రీదేవి మృతిపై అబద్ధాలు చెప్పాల్సిన అవసరమేంటి

శ్రీదేవి మృతిపై అబద్ధాలు చెప్పాల్సిన అవసరమేంటి?

కోట్లాదిమంది అభిమానులు, యావత్ సినీ ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టేసి అతిలోకసుందరి శ్రీదేవి అనంతలోకాలకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఆమె గుండెపోటుతో మరణించినట్లు సంజయ్ కపూర్ మీడియాకు వివరించారు. శ్రీదేవి బంధువులే ఈ విషయం చెప్పినప్పటికీ నటీనటులకు, వీరాభిమానులకు, ఆప్తులకు ఇప్పటికీ సందేహాలు మాత్రం నివృతి కాలేదు. అంతేకాదు తాజాగా దుబాయ్ ఫోరెన్సిక్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి.
 
ప్రమాదవశాత్తు బాత్‌‌టబ్‌‌లోని నీటిలో పడిపోవడం వల్ల శ్రీదేవి చనిపోయిందని రిపోర్టులో తేలింది. అయితే గుండెపోటుతో మరణించినట్లు రిపోర్టులో ఎక్కడా వైద్యులు, అధికారులు ప్రస్తావించనే లేదు. మరణానికి ముందు శ్రీదేవి మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. కాగా ఇంకా విచారణ సాగుతోందని దుబాయ్ పోలీసులు చెప్పారు. అయితే ఆమె ఎలా మరణించారనే దానిపై ఇంకా చిక్కుముడి వీడలేదు. శ్రీదేవి మరణానికి దారితీసిన కారణాలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
 
వెంటాడుతున్న ప్రశ్నలివే..
ఆమె మరణానికి గల కారణాలేంటి? దుబాయ్‌‌ హోటల్‌‌లో అసలేం జరిగింది? బయట ఏం చెప్పారు? మత్తులో శ్రీదేవి తనంతట తానే టబ్‌‌లో పడిపోయారా? వేరే ఎవరైనా తోసేశారా? ముందు కార్డియాక్ అరెస్ట్ అని శ్రీదేవి బంధువులు ఎందుకు చెప్పారు? మృతికి గల కారణాలపై అబద్ధాలు చెప్పాల్సిన అవసరమేంటి?. అసలు ఆమెది ఆత్మహత్యా? లేదా హత్యా? నిజంగా శ్రీదేవి ప్రమాదవశాత్తే చనిపోయారా?. అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
 
రీ-ఇన్వెస్టిగేషన్..
కాగా ఇప్పటికే శ్రీదేవి భర్త బోనీకపూర్‌‌ను మూడుగంటలపాటు సుదీర్ఘంగా విచారించిన పోలీసులు సంచలన నిజాలను సేకరించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు శ్రీదేవి, బోనీకపూర్ కాల్‌డేటాను కూడా పోలీసులు పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూషన్‌‌ రంగంలోకి కేసును రీ-ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి ఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌‌ ఏం తేల్చబోతున్నారు? అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. అతిలోకసుందరి మృతికి గల అసలు కారణాలు తెలియాలంటే మరికొన్నిగంటలు వేచి చూడాల్సిందే.
By sources

Comments