తెలంగాణ రాష్ట్రపు ప్రజాప్రతినిధులు మరియు ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా వారికీ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు చేసుకుంటున్న విన్నపం ,,
తెలంగాణ రాష్ట్రపు ప్రజాప్రతినిధులు మరియు ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా వారికీ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు చేసుకుంటున్న విన్నపం ,,
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఉద్యోగాలు భర్తీ విషయం లో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది .నీళ్లు,నిధులు ,నియామకాలు అన్న ట్యాగ్ లైన్ తో తెలంగాణ ఉద్యమం జరిగింది .2014 నుంచి 2017 ఆఖరి వరకు అన్ని ప్రభుత్వ నియామక సంస్థల ద్వారా దాదాపు 28 000 ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రభుత్వం ప్రకటిచింది .ప్రభుత్వ మేనిఫెస్టో ప్రకారం 1 లక్ష 7 వేల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది .కానీ 2017 ఆఖరి వరకు 28 000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసింది .మిగిలిన 15 నెలల కాలంలో మిగిలిన ఉద్యోగాలు ప్రభుత్వం ఎలా భర్తీ చేస్తుందో మేధావులకు సైతం అంతుబడుటం లేదు లక్షలాది నిరుద్యోగులు ఆతురుతగా ఎదురుచూస్తున్న రాష్ర అటున్నత ఉద్యోగాలైనా గ్రూప్-1 .తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్ ఇంతవరకు ప్రకటించ లేదు .ఆఖరిసారిగా గ్రూప్-1 నోటిఫికేషన్ 2011 సంవత్సరం లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో ఇవ్వబడింది .దాదాపు 7 సంవత్సరాలు కావస్తున్నా ప్రభుత్వము ఇంతవరకు గ్రూప్-1 నోటిఫికేషన్ ప్రకటించలేదు మరియు,2015 డిసెంబర్ 31 తారీఖున వెలువడిన గ్రూప్-2 ఉద్యోగాలు ఇంతవరకు భర్తీ కాలేదు .మరియు కొత్తగా గ్రూప్-3 ,గ్రూప్-4 ,VRO ,పంచాయత్ సెక్రటరీ మొదలగు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇంతవరకు ప్రభుత్వం ప్రకటించ లేదు .సాధారణ డిగ్రీ కలిగిన నిరుద్యోగులు రాష్ట్రం లో ఎక్కువ సంఖ్యలో వున్నారు .వారి కొరకై ప్రభుత్వము ఇంతవరకు ఎటువంటి నోటిఫికేషన్ విడుదలచేయలేదు .ప్రకటించిన ఒక్క గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ ఇంతవరకు నోచుకోలేదు .2 సంవత్సరాలు కావొస్తున్నా గ్రూప్-2 ఉద్యోగాలు ఇంకా భర్తీ కాలేదు . తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పుడు వున్నా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి పూనుకుంటే మన ఉద్యోగాలు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినతరువాత భర్తీ చేసుకుందామని చెప్పి ఉద్యోగాలు భర్తీ చేయకుండా అడ్డుకున్న ప్రజా ప్రతినిధులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 3 సంవత్సరాలు పైబడిన ఇంతవరకు ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.సాధారణ డిగ్రీ చదివిన నిరుద్యోగ యువత ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం లో వున్నారు .అలాంటి యువత కొరకై ప్రభుత్వం ఏర్పడి 3 1 /2 సంవత్సరాలు కావొస్తున్నా ఇంతవరకు నోటిఫికేషన్ ప్రకటించ లేదు .ఇచ్చిన ఒక్క గ్రూప్-2 నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇంకా భర్తీ కాలేదు.రాష్ట్రం లోని ఏంటో మంది నిరుద్యోగులు తమ బలిదానాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమం కొరకై పోరాడారు .తమ ఉద్యోగాల తమకు దక్కుతాయని ఏంతో ఆశ పడ్డారు .కానీ వారి ఆశ లన్ని ఆడియాశలు అయ్యాయి ,ఇప్పటికేనా సమయం మించి పోలేదు ప్రభుత్వం మేల్కొని నిరుద్యోగులు ఆశిస్తున్నా ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసినట్లయితే తెలంగాణ రాష్రమ్ కొరకై తమ బలిదానాలు సమర్పించిన నిరుద్యోగులకు సరైన నివాళి అవుతుంది .ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు ఆశిశ్టున్నారు .మరియు మా యొక్క ముఖ్యమైన విన్నపం తెలంగాణ రాష్ట్రం లో వున్నా మీడియా వారికీ మీరు మా యొక్క సమస్యను ప్రభుత్వం వారికీ తెలియచేయాలి .మీడియా వారు కూడా ఎవ్వరి వత్తిడికి తలోగ్గ కుండా తెలంగాణ లో వున్నా నిరుద్యోగ సమస్యను పత్రికల ద్వారా మరియు టీవీ ల ద్వారా ప్రభుత్వానికి తెలియచేయాలిని తెలంగాణ నిరుద్యోగులు మీడియా వారికీ విన్నవించుకుంటున్నారు ,ఇప్పుడువున్నా తెలంగాణ ప్రభుత్వ ఆలోచన ఏమిటంటే 2019 ఎన్నికల ముందు భారీగా ఉద్యోగాల నోటిఫికెషన్స్ ప్రకటించి నిరుద్యోగులను ఓట్ల కొరకై ప్రలబోపెట్టవచ్చని వారి భావన కానీ ఇప్పుడు తెలంగాణ లో వున్నా యువకులు చాల తెలివైనవారు మరియు ప్రస్తుత తెలంగాణ రాజకీయాలమీద అవహగాహన వున్నవారు .
ఇట్లు,
మీ విధేయులు,
కేశబోయినశ్రీధర్
Comments
Post a Comment