రజినీకాంత్ సంచలన ప్రకటన

రజినీకాంత్ సంచలన ప్రకటన

యూనివర్శల్ హీరో కమల్ హాసన్ పొలిటికల్ ఎంట్రీపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. కొత్త పార్టీతో ఇప్పటికే ప్రజలలోకి వచ్చేసిన కమల్.. ఇక తన పార్టీ విధివిధానాల విషయంలో నిమగ్నమై ఉన్నారు. ఇక కమల్‌తో పాటు తమిళనాడులో కొత్త పార్టీ పెడతానని తెలిపిన సూపర్‌స్టార్ రజనీకాంత్‌ పైనే ఇప్పుడందరి కళ్లు ఉన్నాయి. ఆయన పెట్టబోయే పార్టీ ఏమిటి? ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనే విషయాలపై తమిళనాడు ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. తాజాగా రజినీకాంత్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఆయన ప్రకటించింది కొత్త పార్టీ విశేషాలు కాదండోయ్. కొత్త సినిమా డిటైల్స్ మాత్రమే.
 
సౌత్ సినీ పరిశ్రమలోని పెద్ద డైరెక్టర్స్ అందరూ రజినీకాంత్‌ని ఒక్కసారైనా డైరెక్ట్ చేయాలని కోరుకుంటుంటే.. రజినీ మాత్రం అందుకు విరుద్ధంగా చిన్న చిన్న దర్శకులకు అవకాశమిచ్చి.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆయన ‘‘కాలా, 2.0’’ చిత్రాలతో సినిమాలకు ఫుల్‌స్టాప్ పెడతాడని అనుకుంటుంటే.. మరో సినిమా ప్రకటించి.. మరోసారి వార్తల్లోని వ్యక్తిగా నిలిచారు. ఇక విషయంలోకి వస్తే ‘పిజ్జా’, ‘జిగర్తాండ’, ఇరైవి’ వంటి చిత్రాలతో మంచి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజు.. అతి త్వరలో రజినీకాంత్‌ని డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ యువ దర్శకుడు చెప్పిన కథ రజినీకి నచ్చడంతో వెంటనే ఈ సినిమా మనం చేద్దాం అని రజినీ.. కార్తీక్‌కి మాట ఇచ్చారట. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించనున్నారు.
By sources

Comments