కార్యకర్త కష్టం చూసి చలించిపోయి చంద్రబాబు ఏమిచ్చాడో చూడండి !

చంద్రబాబు గంభీరంగా ఉండటమే తెలుసు. పని చేసుకుపోవడమే తెలుసు. సీరియస్ నాయకుడు గానే తెలుసు. కానీ అవతల కోణం పరిచయం ఉన్నవాళ్లు అతి కొద్దిమందే ! పార్టీ కార్యకర్తల కోసం ఎంతలా ప్రాణం పెడతాడో… కష్టాల్లో ఉంటే ఎలా చలించిపోతాడో పశ్చిమ గోదావరిలో చూశారు. కష్టాల్లో ఉన్న కార్యకర్త కోసం చంద్రబాబు ఏం చేశాడో తెలుసా !
చంద్రబాబు ఊపిరి సలపనంత బిజీలో ఉన్నాడు. కేంద్రంతో పోరాటంలో తలమునకలై ఉన్నాడు. రాజకీయంగా ఎదురుదాడి చేసి తీరాల్సిన ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి టైమ్ లో పశ్చిమ గోదావరి పర్యటన. పోలవరం సందర్శన. రివ్యూ. ఇది కూడా కేంద్రానికి సంబంధించిన విషయమే. ఇంత గంభీరమైన వ్యవహారాల్లో ఉండి కూడా చంద్రబాబు కార్యకర్తను మర్చిపోలేదు. పోగొండ పథకం ప్రారంభం తర్వాత చంద్రబాబు కామవరపు కోటకి కదలారు. అక్కడ టీడీపీ కార్యకర్త సుబాని అచేతనంగా పడి ఉన్నాడు. కొన్ని నెలలుగా చలనం లేదు. చంద్రబాబును స్వయంగా చూడాలని సుబాని ఆశ పడ్డాడు అప్పట్లో. ఆ విషయం బాబు వరకూ చేరింది. ఇప్పుడు స్వయంగా ఇంటికి వెళ్లాడు బాబు. పలకరించినా సుబాని స్పందించే పరిస్థితి లేదు. చూస్తున్నాడు. ఆ ఆనందం కళ్లల్లో కనిపిస్తోంది. ఇప్పటికే నరాలు చచ్చుబడిపోయాయ్. చూసి చలించిపోయాడు బాబు. సుబానీ భార్యా బిడ్డలకి భరోసా ఇచ్చాడు. ఇది వరకులా ఇప్పుడు దాబా నడపడం లేదు కదా మరి ఎలా బతుకు వెళ్లదీస్తున్నారని అడిగాడు. కష్టాలు విన్నాడు. అప్పటికప్పుడు పార్టీ ఫండ్ నుంచి 20 లక్షలు సాయం చేశాడు. బిడ్డల బాధ్యత ఎన్టీఆర్ ట్రస్ట్ తీసుకుంటుంది అన్నాడు. అంతే సుబానీ కళ్లల్లో ఆనందం. చుట్టూ ఉన్నవాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. స్పందించే నాయకుడు అంటే ఇలా ఉంటాడు… చంద్రబాబు అంటే కొండంత అండ అని ఎందుకు అంటారో ఇప్పుడు తెలిసింది వాళ్లకి. అందుకే అంత భరోసా !
చంద్రబాబు ఇలా సాయం చేయడం ఇదేం మొదటిసారి కాదు. లెక్కకు మిక్కిలి ఉదాహరణలున్నాయ్. కాకపోతే పబ్లిసిటీ చేసుకోవడం ముందు నుంచి చంద్రబాబుకి అలవాటు లేదు. 200 ఫించన్ ఇచ్చి ఊరూవాడా డప్పుకొట్టుకున్నవాళ్లని చూశాం. ఓ లక్ష సాయంచేసి రాష్ట్రమంతా ప్రచారం చేయించిన వాళ్లని చూశాం. కానీ కార్యకర్తల్ని కడుపులో దాచుకునే ఇలాంటి ఘటనల్ని మాత్రం చంద్రబాబుతో తప్ప మరెవరితో అయినా ఊహించగలమా ? లేనే లేదు. దటీజ్ బాబు !
By sources

Comments