బోనీ’ పైనే డౌట్?
బోనీ’ పైనే డౌట్?
లెజండరీ నటి, లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి హఠాన్మరణంపై దుబాయ్ ఫోరెన్సిక్ రిపోర్టులో సంచలన అంశాలు బయటపడ్డ సంగతి తెలిసిందే. అయితే మరణం మొదలుకుని ఫోరెన్సిక్ రిపోర్టువరకు అన్నీ ట్విస్ట్‌లే. నిమిషానికో ట్విస్ట్ వెలుగుచూస్తుండటంతో కోట్లాది మంది అభిమానులు, యావత్ సినీ ప్రపంచం ఏది నమ్మాలో? ఏది నమ్మకూడదో? తెలియక తలలు కొట్టుకుంటున్నారు.
ఆ పదం ఎందుకు వాడతారు?
డెత్ సర్టిఫికెట్‌లో అక్కడి అధికారులు వాడిన ‘యాక్సిడెంటల్ డ్రౌనింగ్’ పదం మరింత అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా ఇలా నీటిలో మునిగిపోయి చనిపోయిన కేసు వచ్చినప్పుడు డ్రౌనింగ్ అనే పదం వాడవచ్చు. అలాకాకుండా విచారణ ఇంకా జరుగుతుండగానే ‘యాక్సిడెంటల్ డ్రౌనింగ్’ అనే పదం వాడటంతో క్లియరెన్స్ ఇచ్చినట్లవుతుంది. అయితే ఇలా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే దానిపై కూడా అనుమానాలున్నాయి. ఎవరైనా నీటిలో మునిగిచనిపోయినప్పుడు వారి ఊపిరితిత్తుల్లో నీటి శాతం ఎంత ఉన్నది? ఫోరెన్సిక్ నివేదిక ద్వారా తెలుసుకునే అవకాశముంది. అదేవిధంగా కెమికల్, విస్రా (పెద్దపేగులో ఉండే పదార్థం) అనే పరీక్షలకు పంపిస్తారు. కడుపులో ఉన్నటువంటి పదార్థాలేంటి? ఊపిరితిత్తుల్లో ఎంతమేరకు నీరుంది? మరణించినవారు ఆల్కాహాల్ ఏమైనా తీసుకున్నారా? కెమికల్ కంటెట్స్ ఏమున్నాయి? అనే విషయాలు నిర్దారణ చేసుకునే అవకాశాలున్నాయి. అవన్నీ పూర్తి చేసిన తర్వాతే పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటివేమీ కాకుండా డెత్ సర్టిఫికెట్లో మాత్రం ‘యాక్సిడెంటల్ డ్రౌనింగ్’ అనే పదం వాడటం పలు అనుమానాలకు తావిస్తోంది.
డౌట్.. బోనీ..!
ఈ కేసులో సంబంధించి భర్త బోనీ కపూర్ చెబుతున్న కథనంతో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీదేవిని సర్‌ఫ్రైజ్ చేయడానికి వచ్చానన్న బోనీ.. మేమిద్దరం సుమారు 15నిమిషాలు మాట్లాడుకున్నాం.. నవ్వుకున్నామని చెప్పారు. అనంతరం ఓ ఫంక్షన్‌కు వెళ్లాలని రెడీ కావాలని చెప్పగా.. ఆమె బాత్‌రూమ్‌కు వెళ్లిందని చాలా సేపటికీ బయటికి రాకపోవడంతో తీవ్ర ఆందోళన చెంది తలుపులు పగలగొట్టగా అపస్మారక స్థితిలో కనిపించింది. దీంతో షాక్‌కు గురై స్నేహితుడికి ఫోన్ చేశాననీ.. ఆ తర్వాతే హోటల్ యాజమాన్యానికి చెప్పి సమీపంలో ఉన్న రషీద్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించిందని వైద్యులు నిర్దారించారు.
అయితే ఏదైనా స్టార్ హోటల్స్‌లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎమర్జెన్సీ టీం ఉంటుంది.. వైద్యులు కూడా అందుబాటులో ఉంటారు లేదంటే మెడికల్ హెల్ప్ ఇచ్చే ఏర్పాటు ఉంటుంది. మొదట హోటల్ వాళ్లకు చెప్పకుండా స్నేహితుడికి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆమె చనిపోయిందని దృవీకరించుకున్న తర్వాతే స్నేహితుడికి చెప్పారా? అసలు ఈ విషయాన్ని ఎందుకింత ఆలస్యంగా చెప్పాల్సి వచ్చింది?.
అనుమానాలు..?
మొదట కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లిన బోనీ ముంబైకి తిరిగొచ్చేసిన తర్వాత ఆ రెండ్రోజులు ఆమె బయటికి రాకుండా గదిలోనే ఉన్నారనే విషయాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బోనీ, శ్రీదేవి కాల్ డేటాను పరిశీలించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మరోవైపు ప్రాసిక్యూషన్ రంగంలోకి దిగడంతో రీ-ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఈ ఇన్వెస్టిగేషన్‌లో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి విచారణ జరుగుతుంది. ఫోరెన్సిక్ పూర్తి రిపోర్టు వచ్చిన తర్వాత మాత్రమే కుట్ర జరిగిందా? లేదా ఆత్మహత్యా? లేదా సహజ మరణమా? అన్నది తేలనుంది. ఆ తర్వాతే శ్రీదేవి పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుమానాలున్న విషయం వాస్తవమే.. వీటిని నివృతి చేసుకునేందుకు న్యాయనిపుణులు, పోలీసు విభాగం ప్రయత్నాలు చేస్తున్నాయని సమాచారం.
By sources
Comments
Post a Comment