తెలంగాణలో పొత్తులపై చంద్రబాబు పరోక్ష సంకేతాలు
తెలంగాణలో పొత్తులపై చంద్రబాబు పరోక్ష సంకేతాలు
తెలంగాణలో పొత్తులపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో భేటీ అయిన ఆయన పొత్తులపై మాట్లాడుతూ ‘‘ పొత్తు ఉండదని ఒక పార్టీ ప్రకటించింది. మరొకటి అన్యాయం చేసిన పార్టీ. ఇక మిగిలింది తెలంగాణ కోసం పోరాటం చేసిన పార్టీ. అందరితో చర్చించిన తర్వాతనే పొత్తుపై నిర్ణయం తీసుకుందాం. తెలంగాణలో ఓటు బ్యాంకును ఇంకా పెంచుకోవాలి. తెలంగాణలో అన్ని పార్టీలు రోడ్డెక్కాయి..మన శక్తిని కూడగట్టుకోవాలి. అవసరాన్ని బట్టి పార్టీ వ్యూహాలు మార్చుకోవాలి. తెలంగాణలో నాయకత్వం సొంతంగా ఎదగాలి. మా కుటుంబం నుంచి నాయకులు కావాలనడం సరికాదు. నెలకోసారి తెలంగాణకు వస్తా పార్టీకోసం సమయం వెచ్చిస్తా’’ అని అన్నారు.
By sources
Comments
Post a Comment