హుక్కా తాగిన ఇంజినీర్.. కనిపించని ఊపిరితిత్తులు! #ఊపిరితిత్తులు #హుక్కా

రెండు నెలలపాటు హుక్కా తాగిన వ్యక్తి తర్వాత శ్వాసకోశ ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరాడు. సీటీ స్కాన్‌లో కనిపించిన అతడి ఊపిరితిత్తులను చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. ముంబైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇటీవల సింగపూర్ వెళ్లాడు. వస్తూవస్తూ ఓ హుక్కాను, తాగేందుకు ‘మ్యాజిక్ కోల్’ తీసుకొచ్చాడు. రెండు నెలలపాటు ఇంటి దగ్గర హుక్కా తాగాడు. హుక్కా తర్వగా మండేందుకు బొగ్గును రసాయనాల్లో ముంచేవాడు. రెండు వారాల క్రితం ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరాడు. సీటీ స్కాన్ చేసిన వైద్యులు రోగి ఊపిరితిత్తులను చూసి ఆశ్చర్యపోయారు. ఊపిరితిత్తుల చుట్టూ తెల్లని ప్యాచ్‌లు చూసి అవాక్కయ్యారు. బ్యాక్టీరియా కారణంగా గుండెకు ఇన్ఫెక్షన్ సోకినట్టు గుర్తించారు. రెండు వారాలుగా అతడికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ మందులు ఇస్తున్నట్టు ఆసుపత్రి పల్మనాలజిస్ట్ డాక్టర్ అరవింద్ కటె తెలిపారు. రెండు వారాల అబ్జర్వేషన్ అనంతరం ఇటీవల అతడిని డిశ్చార్జ్ చేసినట్టు పేర్కొన్నారు.
 
ఇంటి వద్ద హుక్కా తాగేవారిలో చాలామంది త్వరగా మండించేందుకు బొగ్గును కెమికల్స్‌లో ముంచుతున్నట్టు తెలిపారు. మ్యాజిక్ కోల్‌ను మండించడం వల్ల విషపూరితమైన కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వాయువులు వెలువడతాయని లోకమాన్యతిలక్ మునిసిపల్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ నీలకంఠ్ అవద్ తెలిపారు. దీనివల్ల ఆస్తమా రోగులు ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారిలో ఊపిరిత్తుల ఫెయిల్యూర్‌కు దారితీస్తుందని వివరించారు. మ్యాజిక్ కోల్, హుక్కా ప్లేవర్లు, ఇతర స్మోకింగ్ మెటీరియళ్లలో 28 రకాల క్యాన్సర్ కారకాలుంటాయని పేర్కొన్నారు.
 By sources 

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!