సోషల్ మీడియా దెబ్బకి మరో హీరోయిన్ బలి విషాదం లో ప్రియా ప్రకాష్
సోషల్ మీడియా దెబ్బకి ప్రియా ని ఇంటి నుంచి పంపేసిన తల్లితండ్రులు
సోషల్ మీడియా అంతా ఇప్పుడు ఓ కేరళ కుట్టి గురించి చర్చ జరుగుతోంది. ఆ హీరోయిన్ పేరు ప్రియా ప్రకాష్ వారియర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం 20 సెకన్లలో తన ఎక్స్ప్రెషన్స్ తో ఇండియా మొత్తం లోని యూత్ ని ఫిదా చేసి అల్లు అర్జున్ వంటి హీరోలను కూడా చూపు తిప్పుకోనీకుండా చేసిన ప్రియాకు ఇప్పుడో కష్టమొచ్చింది. సెలబ్రెటీ స్టేటస్ రానంత వరకూ ఎవరూ పట్టించుకోరు… ఒక్కసారిగా.. పైగా ఈ రేంజ్‌లో సెలబ్రెటీ హోదా దక్కించుకుంటే మీడియా దృష్టంతా అలాంటి వాళ్ల పైనే ఉంటుంది. సెలబ్రిటీల నుంచి సాదారణ వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరు ఇపుడు ప్రియ గురించే చర్చలు.
ఇప్పుడు ఇదే ప్రియ కి కష్టాలు తెచ్చి పెడుతుంది. ఈ రేంజ్‌లో క్రేజ్ రావడంతో ఆమె ఇంటర్వ్యూ కోసం మీడియా ప్రతినిధులు క్యూ కడుతున్నారు. ఆమె ఇంటి చుట్టూ కోలాహలం నెలకొంది. అయితే తమ కూతురికి పేరు రావడం మంచిదే అయినా మీడియా చేస్తున్న హడావుడితో చాలా ఇబ్బందిగా కూడా ఉందని ప్రియా తల్లి ప్రీతా తెలిపారు. తనకు మీడియా ప్రతినిధుల నుంచి ఫోన్లు వస్తున్నాయని, దీని వాళ్ళ కుటుంబం మొత్తం చాలా ఇబ్బందులు పడుతునన్నారు అని ప్రియ తల్లి తెలిపారు. హాస్టల్‌కు ఎందుకు పంపించారని ప్రియా తల్లిని అడగ్గా.. ఉన్నట్టుండి వచ్చిన ఈ క్రేజ్‌తో తమ కూతురికి కొంత ఇబ్బందిగా కూడా ఉందని ఆమె చెప్పారు. అందుకే ఈ హడావుడి తగ్గేంత వరకూ హాస్టల్‌కు పంపినట్లు తెలిపారు. పైగా చిత్ర దర్శకుడు కూడా సినిమా విడుదలయ్యే దాకా ప్రియా ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వొద్దని చెప్పినట్లు ఆమె తల్లి చెప్పారు. సినిమా కొంత మాత్రమే పూర్తయిందని, ఇంకా షూటింగ్ చేయాల్సింది చాలా ఉందని దర్శకుడు తమతో చెప్పాడని, ఈ తలనొప్పంతా ఎందుకని ప్రియాను హాస్టల్‌కు పంపినట్లు ఆమె తల్లి ప్రీతా తెలిపారు. సినిమా షూటింగ్ ఇంకా ఉన్న తరుణం లో ఇదంతా ప్రియ కు చాలా ఇబ్బందిగా ఉంది అని కొన్ని రోజులు హాస్టల్ లో ఉండి ఈ హడావుడి అంత తగ్గకా షూటింగ్ ప్రారంభం చేసే….. దిశగా డైరెక్టర్ అలోచిస్తునారు… అని ఆమె వెల్లడించారు
By sources
Comments
Post a Comment