కమ్యూనిస్ట్ నేత అమానుషం: గర్భవతి కడుపుపై కాలితో తన్నడంతో గర్భస్రావం

కేరళ: భర్తపై దాడి చేస్తున్న వారిని వారించేందుకు వెళ్లిన ఓ మహిళను కమ్యూనిస్ట్ నాయకుడు అత్యంత అమానుషంగా కడుపుపై కాలితో తన్నడంతో గర్భస్రావమైంది.

కోజీకోడ్‌కు చెందిన జోస్నా సిబ్బి అనే మహిళ కుటుంబానికి మరో కుటుంబానికీ మధ్య కొంత కాలంగా భూవివాదం నడుస్తోంది. ఈ విషయంపై కొందరు వామపక్ష కార్యకర్తలు కొందరు జోస్నా ఇంటికి వచ్చి ఆమె భర్తపై దాడికి దిగారు. ఈ గొడవను అడ్డుకునేందుకు బాధితురాలు ప్రయత్నించగా ఆమె కడుపుపై కాలుతో బలంగా తన్నడంతో తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే ఆమెను అసుపత్రికి తీసుకెళ్లగా గర్భస్రావమైనట్లు వైద్యులు తెలిపారు. ఆమె నాలుగు నెలల గర్భిణి. అంతకు ముందు ఆమెకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు.  ఈ ఘటన చోటుచేసుకోవడానికి 15నిమిషాల ముందే బాధితురాలు పోలీసులకు ఫోన్‌ చేసింది. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు అధికార పార్టీ నాయకుడితో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేశారు.

జనవరి 27న జరిగిన ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  నిందితులపై ఫిబ్రవరి 2న బాధితురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికీ బాధిత కుటుంబానికి వామపక్షవర్గాల నుంచి బెదిరింపులు వస్తున్నట్లు జోస్నా తెలిపింది. కేసును వెనక్కి తీసుకోకపోతే తన భర్త కాళ్లు నరికేస్తామంటూ బెదిస్తున్నారని పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలను సీపీఎం ఖండించింది. ఈ కేసుతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదనీ, అనసవర నిందలు వేస్తున్నారని పార్టీ కార్యకర్త ఒకరు తెలిపారు.
By sources

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!