నీరవ్ మోదీ ఫామ్‌హౌస్ సీజ్...
నీరవ్ మోదీ ఫామ్‌హౌస్ సీజ్...
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.11.400 కోట్లు టోకరా ఇచ్చి విదేశాలకు పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆస్తులపై సీబీఐ దాడులు ఉధృతం చేసింది. బుధవారంనాడు నీరవ్ మోదీ ఫౌమ్‌హౌస్‌కు సీబీఐ సీల్ వేసింది. మహారాష్ట్రలోని అలీబాగ్‌లో 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫామ్‌హౌస్ ఉంది. ఇందులో ఒక బంగళా కూడా ఉంది.
మరోవైపు, పీఎన్‌బీ కుంభకోణంపై పలు కోణాల నుంచి దర్యాప్తు జరుపుతున్న సీబీఐ ఆ బ్యాంకు జనరల్ మేనేజర్ ర్యాంక్ అధికారి రాజేష్ జిందాల్‌ను అరెస్టు చేసింది. 2009 నుంచి 2011 మే వరకూ పీఎన్‍బీ బ్రాడీ హౌస్ బ్రాంచ్ హెడ్‌గా జిందాల్ ఉన్నారు. ఆయన హయాంలోనే నీరవ్ గ్రూప్ సంస్థలకు పరిమితికి మించి ఎల్‌ఓయూలు మంజూరు చేసే ప్రక్రియ మొదలైంది. జిందాల్ ప్రస్తుతం న్యూఢిల్లీ పీఎన్‌బీ హైడ్డాఫీస్ జనరల్ మేనేజర్ క్రెడిట్‌గా ఉన్నారు. కాగా, ఫైర్‌స్టార్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసిడెంట్ విపుల్ అంబానీని కూడా సిబీఐ మంగళవారంనాడు అరెస్టు చేసింది.
Comments
Post a Comment