కేసీఆర్..గారు దేశ ప్రధానమంత్రికి నువ్విచ్చే గౌరవం ఇదేనా..?
కేసీఆర్..గారు దేశ ప్రధానమంత్రికి నువ్విచ్చే గౌరవం ఇదేనా..? ప్రధానమంత్రిని ‘గాడు’ అన్న నీకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో పంటబీమా, ఈనామ్, సమృద్ధిగా యూరియా, విద్యుత్తు, మౌలిక వసతులు ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టి, ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటే.. ఆ పథకాలనూ సక్రమంగా అమలు చేయలేని అసమర్థ ముఖ్యమంత్రివి.. నీవు. నువ్వా రైతుల గురించి మాట్లాడేది.. అసలు నువ్వు... హోష్ లో ఉండే మాట్లాడావా..?
దేశ అత్యున్నత పదవి ప్రధానమత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ‘గాడు’ అని... నువ్వు తెలంగాణ భాష, యాస, మర్యాద, గౌరవాన్ని నడిబజారులో మంట కలిపావ్.. నీకు అసలు తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని క్షమాపణ చెప్పు... లేకుంటే తెలంగాణ సమాజం నిన్ను క్షమించదు. ప్రజలే తగిన బుద్ధి చెప్తారు.
#BJP4Telangana
Comments
Post a Comment