సౌందర్య విషాదం

సౌందర్య విషాదం

శ్రీదేవీ!
నీవు మహానటివి
ఉన్నా లేనట్టు
లేకున్నా ఉన్నట్టు నమ్మించగలవు
వెండితెరమీద కనిపిస్తూ
ఎంతకాలమైనా భ్రమల్లో వుంచగలవు
వేలపూల మార్దవమా!
వృద్ధాప్య స్వర్శ అంటకుండా నిష్ర్కమించడం
నీకు మాత్రమే తెలిసిన కళ
నీ హీరోలు వేసినవి కుప్పిగంతులు
నీవి మాత్రమే నృత్యభంగిమలు
అందుకే పాటల్లో వానంతా నీమీదే కురిసేది
నీ కలువ కళ్ళ చూపులు
పైకి ప్రసరిస్తే హరివిల్లులు
కిందికి సారిస్తే విరితోటలైనాయి
నీ యౌవనదేహ పదనిసలు
విన్యాసాలై పరవశాలై నవరసాలై
మా కళ్ళనుంచి జాలువారిన జలపాతాలైనాయి
సావిత్రి పోయిన తర్వాత– నటనకు
సౌందర్య గరిమను నేర్పిన విశ్వనటివి నీవే
శాపవశాత్తు దివి నుండి భువికి జారిపడి
మానవాతీత కాలమానంలో
మొగ్గ పువ్వయ్యేంత కాలాన్నే మాకు ప్రసాదించి
అకస్మాత్తుగా వెళ్ళిపోయిన ఊర్వశీ!
కలత నిద్రలో మేము కలవరించేది
నీవు ఉన్నావు, మాతో ఉండి తీరుతావనే
సత్యాసత్యాన్ని మాత్రమే!

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!