తరచుగా భారతప్రధాని పై విమర్శలు చేస్తున్న ప్రకాష్ రాజ్ ను ఒక ఆట ఆడిస్తున్న బిజెపి ఏంపి
దక్షిణ భారత దేశంలొ ప్రకాష్ రాజ్ అంటే తెలియని వారుండరు. బాలీఉడ్ తొ సహా అన్ని భాషల సినిమాలలొ నటిస్తూ గొప్ప సినిమా ఆర్టిస్ట్ గా పేరుపొందారు. అయితే మహా నటుడైన ప్రకాష్ రాజ్ లొ ఉన్న ప్రత్యేకత ఏమిటంటే “ఆయన సినిమాలలొ జీవిస్థాడు, జీవితంలొ నటిస్థాడు” … కమ్యునిస్టు విధ్యార్ధి నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించిన ప్రకాష్ రాజ్, తన సహజ నటనతొ దూరదర్శన్ ద్వారా వెలుగులొకి వచ్చి, తరువాత సినీ ప్రపంచానికి పరిచయమయ్యాడు.
అయితే ఈ మద్య సడన్ గా ప్రకాష్ రాజ్, ప్రతి దానికి ప్రధాని మోది ని టార్గెట్ చేయడం మొదలు పెట్టాడు. ముఖ్యంగా గౌరి లంకేష హత్య దగ్గరి నుండి. ఆ హత్య చేసింది మావొయిస్టులే అతి తెలిసినప్పటికీ, ఆ పాపాన్ని ప్రధాని మీదకు తొయడానికి విశ్వప్రయత్నం చేశాడు. కర్ణాటకలొ గత నాలుగు సంవత్సరాలలొ 45 మంది RSS, BJP కార్యకర్తలను చంపినప్పుడు ఒక్కసారి కూడా స్పందించని ప్రకాష్ రాజ్ … అయిన దానికి, కాని దానికి మోది గారిని టార్గెట్ చేస్తుండటంతొ, ఇక మైసూర్ బిజెపి ఏంపి “ప్రతాప్ సింహా” రంగంలొకి దూకాడు.
ఇక సొషల్ మీడియా లొ పెద్ద యుద్దమే మొదలైంది. కర్ణాటక సొషల్ మీడియా రెండు గ్రూఫులుగా విడిపొయింది. 1) ప్రకాష్ రాజ్ వర్గం 2) ప్రతాప్ సింహా వర్గం. కర్ణాటకలొ డైనమిక్ లీడర్ గా పేరున్న ప్రతాప్ సింహ, నేరుగా ప్రకాష్ రాజ్ ను టార్గెట్ చేయడం మొదలు పెట్టాడు. అయితే ప్రతాప్ సింహ గురించి, సరిగా తెలియని ప్రకాష్ రాజ్, ప్రతాప్ సింహా పై పెద్ద ఏత్తున విమర్శలు గుప్పించాడు. దీనితొ ప్రతాప్ సింహ, సొషల్ మీడియాలొ, బహిరంగ సభలలొ ప్రకాష్ రాజ్ ను ఒక ఆట ఆడుకున్నాడు. ప్రకాష్ రాజ్ జీవితం మొత్తం బయట పెట్టాడు.
సామాజిక భాద్యత అంటున్న ప్రకాష్ రాజ్, 2013 లొ తన కుమారుడు చనిపొయిన తరువాతి రొజే, ఒక పార్టీకి హాజరయి అక్కడి డాన్సర్లతొ ఏలా చిందులు వేయగలిగావని ప్రశ్నించాడు, తన కుటుంబమే తనను Selfish Man గా చెప్పలేదా అంటూగుర్తు చేశాడు, సినిమా చాన్సుల కొసం, చివరికి తన Identity ని కూడా మార్చుకున్న నువ్వు ప్రధాని మోది ని ఏలా విమర్శిస్థావని ప్రకాష్ రాజ్ దుమ్ము దులిపాడు.
దీనితొ ఊహించని ఈ ప్రతి చర్యకు బిత్తరపొయిన ప్రకాష్ రాజ్, చేసేదేం లేక ప్రతాప్ సింహా మీద మైసూర్ కొర్టులొ పరువు నష్టం కేసు వేసి,. గౌరి లంకేశ్ హత్య జరగడంతొ మరింతగా ప్రశ్నించానని, అవి నిర్దుష్ట వ్యక్తులు లేక పార్టీల్ని ఉద్దేశించినవి కావని చెబుతూ దారికొచ్చారు.
Comments
Post a Comment