మరికాసేపట్లో ఏపీ గురించి జైట్లీ ప్రకటన

మరికాసేపట్లో ఏపీ గురించి జైట్లీ ప్రకటన!

బడ్జెట్‌‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందంటూ సమావేశాలు ప్రారంభమైన నాటినుంచి ముగిసే వరకూ అటు లోక్‌‌సభలో ఇటు రాజ్యసభలో ఏపీ ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ సభలో మాట్లాడినప్పటికీ ఏపీ గురించి ఎలాంటి ప్రకటనలు చేయలేదు. దీంతో ఏపీ ప్రజలు, ఎంపీలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. మిత్రపక్షమైన బీజేపీతో టీడీపీ ఎంపీలు చర్చలకు దిగారు.!
 
సుదీర్ఘ చర్చలు.. 
తాజాగా కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో కేంద్రమంత్రి సుజనా చౌదరి మంతనాలు జరిపారు. సుమారు అరగంటపాటు వీరిమధ్య పలు విషయాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా ఏపీకి రావాల్సిన నిధులు, ప్యాకేజీ చట్టబద్దత విషయాలపై నిశితంగా చర్చించినట్లు తెలుస్తోంది. జైట్లీ, అమిత్ షా నుంచి సానుకూలంగా స్పందన వచ్చినట్లు తెలుస్తోంది.
 
మరికాసేపట్లో ప్రకటన..! 
సుధీర్ఘ మంతనాల అనంతరం రాజ్యసభలో అరుణ్‌ జైట్లీ మరోసారి ప్రకటన చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఇవాళ రాజ్యసభ సమావేశాలు పూర్తయ్యే లోపు ప్రకటన చేస్తారా? లేదా మరికొన్ని రోజులు సమయం పడుతుందా? అనే దానిపై స్పష్టత రాలేదు. కాగా ప్రకటనలో ప్రస్తావించే అంశాలపై సుజనాకు కేంద్రమంత్రి వివరించినట్లుగా సమాచారం. రెండు సార్లు ప్రకటన చేసినప్పటికీ సంతృప్తి కలిగించలేదని సుజనా మంత్రులకు వివరించారు. దీంతో మరోసారి ప్రకటనకు కేంద్రమంత్రి సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే మరోవైపు నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వాలని సీఎం చంద్రబాబు పట్టుబడుతున్నారు. అయితే అరుణ్ జైట్లీ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో వేచి చూడాల్సిందే.
By sources

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!