సుజనాచౌదరి ఎఫెక్ట్... దిగొచ్చిన కేంద్రం
సుజనాచౌదరి ఎఫెక్ట్... దిగొచ్చిన కేంద్రం!
ఏపీ టీడీపీ ఎంపీలు కేంద్రంతో అమీతుమీకి సిద్ధంకావడంతో ముచ్చటగా మూడోసారి ఏపీ సమస్యలపై ప్రకటన చేయాలని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్ణయించుకున్నారు. లోక్‌సభలో రెండు సార్లు ప్రకటన చేసినా టీడీపీ ఎంపీలు సంతృప్తి చెందకపోవడంతో జైట్లీ కాసేపట్లో రాజ్యసభలో మరోసారి వివరణ ఇవ్వాలని నిర్ణయించారు. మొదటిసారి ప్రకటనకు,రెండోసారి ప్రకటనకు తేడా లేకపోవడంతో జైట్లీ తీరుపై ఎంపీలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాజ్యసభ లాబీల్లో కేంద్రమంత్రి సుజనాచౌదరి.. జైట్లీని నిలదీశారు కూడా. మరోవైపు ఉభయసభల్లో టీడీపీ ఎంపీలు తమ నిరసనలను హోరెత్తించారు.
కాసేపట్లో జైట్లీ రాజ్యసభలో ప్రకటన చేయాల్సి ఉంది. ఈ ప్రకటనలో ఏపీ గురించి స్పష్టమైన ప్రకటన చేయాలని టీడీపీ ఎంపీలు పట్టుబడుతున్నారు. అరుణ్ జైట్లీ, అమిత్‌షాతో సుజనా మంతనాలు చేస్తున్నారు. రాజ్యసభలో మరోసారి అరుణ్ జైట్లీ ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రకటనలో ప్రస్తావించే అంశాలపై సుజనా సుదీర్ఘ మంతనాలు చేస్తున్నారు. నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వాలని సీఎం చంద్రబాబు మొదటి నుంచి పట్టుబడుతున్నారు. ఇందుకు అనుగుణంగా ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు.
గురువారం రాజ్యసభ లాబీలో అరుణ్ జైట్లీ, సుజనా చౌదరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రెండు సార్లు ప్రకటన చేసినా సంతృప్తి చెందకపోతే ఎలా అని సుజనాను జైట్లీ ప్రశ్నించారు. డొల్ల ప్రకటనలతో ప్రజలను మోసం చేయలేరని... అరుణ్ జైట్లీతో సుజనా చౌదరి వాదనకు దిగారు. రాజకీయ పార్టీలు ఉంటాయి.. పోతాయి... కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని సుజనా పట్టుబట్టారు. పార్టీలకు విలువ ఇవ్వాలి కానీ... సభ్యులకు కాదని సుజనా వ్యాఖ్యానించారు. సుజనా బదులుతో అరుణ్‌జైట్లీ కలతచెందారు.
By sources
Comments
Post a Comment