బాత్‌టబ్‌లో మునిగి చనిపోవడం సాధ్యమేనా
బాత్‌టబ్‌లో మునిగి చనిపోవడం సాధ్యమేనా?
అందాల నటి శ్రీదేవి ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో మునిగి చనిపోయారని ఫోరెన్సిక్ విభాగం ఇచ్చిన నివేదికను యూఏఈ ఆరోగ్యశాఖ వెల్లడించింది. శ్రీదేవి ఎత్తు 1.68 మీటర్లు! అంటే 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉన్న శ్రీదేవి..2 అడుగుల లోతు కూడా ఉండని బాత్‌టబ్‌లో మునిగి చనిపోయిందా? అసలు అది సాధ్యమేనా? అన్న అనుమానాలు కల్గుతున్నాయి.
ఏ బాత్‌టబ్..ఎన్ని అడుగుల లోతు?
ప్రపంచంలో ఏ స్టార్ హోటల్ అయినా బాత్‌టబ్‌ల ఏర్పాటులో కొన్ని ప్రమాణాలు, కొలతలను అనుసరిస్తుంది. బాత్‌టబ్‌లు సాధారణంగా సగటున 14 నుంచి 17 అంగుళాల లోతు ఉంటాయి. అంటే దాదాపు 1.4 అడుగుల లోతన్నమాట! యూరోపియన్ స్టైల్ బాత్‌టబ్‌లు 18 ఇంచ్‌ల లోతు కల్గి ఉంటాయి. అంటే 1.5 అడుగుల లోతు ఉంటాయి. ఇక జపనీస్ లేదా గ్రీక్ స్టైల్ బాత్‌టబ్‌లు 22 అంగుళాల కంటే ఎక్కువ లోతుంటాయి. అంటే జపాన్ బాత్‌టబ్‌లు 1.8 అడుగుల కంటే ఎక్కువ లోతు ఉంటాయన్నమాట! ‘డ్రాప్ ఇన్’ రకమైనా, ‘స్టాండ్ ఎలోన్’ వెరైటీ అయినా బాత్ టబ్‌లు అటు ఇటుగా ఒకే రకమైన కొలతలు కల్గి ఉంటాయి.
ఓవల్ ఆకారంలోని బాత్‌టబ్‌లు 20- 24 అంగుళాల లోతు ఉంటాయి. అదే వర్ల్‌పూల్ బాత్‌టబ్‌లు దాదాపుగా 18 ఇంచ్‌ల లోతు ఉంటాయి. ఒక మనిషి ఎంత మద్యం మత్తులో ఉన్నా..అపస్మారక స్థితిలో మునిగిపోయే పరిస్థితి ఎదురైనప్పుడు..వెంటనే రెండు అడుగుల లోతు కూడా లేని బాత్ టబ్ నుంచి పైకి లేవడం కష్టం కాదంటున్నారు నిపుణులు! మరి 5.6 అడుగుల ఎత్తున్న శ్రీదేవి..బాత్‌టబ్‌లో మునిగిపోయి చనిపోయారన్న దుబాయ్ ఫోరెన్సిక్ నివేదిక అభిమానుల్లో అనేక అనుమానాలు కల్గిస్తోంది. ఫోరెన్సిక్ నివేదిక నిజమైతే..హోటల్ గదిలో ఏం జరిగింది? బాత్రూమ్‌లో ఆమె గుండెపోటుతో కుప్పకూలిపోయారా? మరే ఇతర కారణాలున్నాయా? ఇలా శ్రీదేవి మరణంపై మిస్టరీ కొనసాగుతోంది.
Comments
Post a Comment