శ్రీశైలంలో నేలమాళిగ

శ్రీశైలంలో పురాతన రుద్రాక్షమఠం జీర్ణోద్ధరణ పనుల్లో భాగంగా బుధవారంనాటి తవ్వకాల్లో ఆరు అడుగుల పొడవున్న చిన్నపాటి సొరంగ మార్గంతో కూడిన నేలమాళిగ (3.5 అడుగుల ఎత్తు, 4.5 చ.అడుగుల వెడల్పు ఉన్న భూగర్భ గది) బయటపడింది. గది పైకప్పు రాతిబండతో ఉండగా, చుట్టూ మూడువైపులా రాతికట్టడంతో కూడిన గోడలు ఉన్నాయి. ఒక వ్యక్తి దూరి వెళ్లేంత ప్రవేశ ద్వారం ఉంది. పూర్వం మఠాధిపతుల కాలంలో ఈ గదిని పూజా మందిరంగా వినియోగించి ఉండొచ్చని భావిస్తున్నారు. నేలమాళిగలో పెద్దఎత్తున లభించిన రాగి, ఇత్తడి పూజా సామగ్రిలో బేసిన్లు రెండు, బాండి ఒకటి, 26 చెంబులు, ఒక ధూపపాత్ర, ఒక గిన్నె, 2 పెద్ద గుడిగంటలు, 3 చిన్న పూజామందిర గంటలు, 6 చిన్నగజ్జెలు, 5 గుండ్రటి గిన్నెలు, విరిగిన ప్లేట్లు, 2 కడియాలు, ఆరు హారతి దీపాలు, 19 ఇతరత్రా సామాన్లు ఉన్నాయి.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!