‘బడ్జెట్‌పై కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు’

KTR  ఒక EDUCATED  ILLITERATE

బాహుబలి కలెక్షన్లంతా నిదులు కూడా కేంద్రం తెలంగాణకు ఇవ్వలేదని KTR విమర్శిస్తున్నారు.అయన  ఒక EDUCATED ILLETERATE , చదువుకున్న నిరక్షరాస్యుడు.

ఎందుకంటే భారతీయ చిత్ర పరిశ్రమలో మొత్తం  ఏడాదికి 2000  సినిమాలు,8000 స్క్రీన్లు, రూ 15,500 కోట్ల కలెక్షన్లు. మొత్తం భారత సినిమా పరిశ్రమ కలెక్షన్లకు రెట్టింపు    నిదులు  కేంద్రం ఇస్తున్నది.

కేంద్ర పన్నుల నుండి గత సంవత్సరం  కంటే 16 శాతం అదనం, అంటే మొత్తం రూ 19600 కోట్లు ఈ సంవత్సరం రానుంది 15000 కోట్లు గ్రాంటు రానుంది .ఇది కాకుండా కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా ఒక 10 వేల కోట్లు వస్తుంది.

బీజేపీకి దక్షిణాదిలో ఉనికి లేదు. ఉత్తరాదిలో అక్కడక్కడ ఉన్న ఆ పార్టీ జాతీయ పార్టీ ఎలా అవుతుంది అని KTR ప్రశ్నిస్తున్నారు. దక్షిణాదిలో గతంలో కర్ణాటకలో మా ప్రభుత్వం ఉంది. బీజేపీ గతంలో ఉమ్మడి ఏపీలో 19 శాతం ఓట్లు సాధించింది. రెండు సార్లు బీజేపీ మద్దతుతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ రోజు దేశంలో 19 రాష్ట్రాలు బీజేపీ చేతిలో ఉన్నాయి. 30 ఏళ్ళ  తర్వాత ఒక పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చి మోడీని ప్రధాని చేశారు. ఇది KTR కి కనబడడం లేదా? కేటీఆర్  కళ్ళు ఉన్న కబోదిలా ప్రవర్తిస్తున్నారు.

హైదరాబాద్ లో 15 సీట్లుంటే 1 సీటు గెలిచారు, ఖమ్మంలో 10 సీట్లుంటే 1 సీటు గెలిచారు, రంగారెడ్డి లో 14 సీట్లుంటే 4 సీట్లు గెలిచారు.మరి మీది ఉత్తర తెలంగాణ పార్టీయా? లేక ఉప ప్రాంతీయ పార్టీనా? మీది తెలంగాణ పార్టీ ఎట్లా అవుతుంది. 2014 లో తెలంగాణాలో 35 శాతం ఓట్లు, 52 శాతం సీట్లు వచ్చిన తెరాస తెలంగాణ పార్టీ అయినప్పుడు దేశ వ్యాప్తంగా 32 శాతం ఓట్లు, 53 శాతం సీట్లు వచ్చిన బీజేపీ కచ్చితంగా జాతీయ పార్టీ అవుతుంది.

అయినా,కాశ్మీర్ స్వతంత్రంగానే ఉండాల్సింది.భారత దౌర్జన్యం చేసి కాశ్మీర్ ని కలుపుకుంది అని మాట్లాడిన మీ అక్కకు, తెలంగాణను పాక్ లో కలపాలన్న నిజాం ను నిత్యం పొగిడే మీ నాన్నకు, మీ కుటుంబానికి జాతీయ స్ఫూర్తి గురించి ఎం తెలుసు?

బాహుబలి సినిమాలో రాజు ప్రజల కోసం కష్టపడ్డాడు అలా ప్రజల కోసం నిస్వార్ధంగా కష్టపడుతున్న వ్యక్తే నరేంద్ర మోడీ. అందుకే నరేంద్ర మోడీని బాహుబలి అని అంటున్నారు. కానీ రాష్ట్రములో మాత్రం మన రాజు కుటుంబం కోసం కష్టపడుతున్నాడు.కుటుంబం కోసం ప్రజలను బలి చేస్తున్నాడు. అందుకే కెసిఆర్ ను ప్రజాబాలి అని బీజేపీ అంటున్నది.

KTR గారు, మీరు బాహుబలి గురించి బాగా మాట్లాడుతున్నారు. బాహుబలి సినిమాలో  నటించినంత మందికి కూడా మీరు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. మరి మీ పాలనను ఎం అనాలి. 

చెవిటోని ముందు శంఖం ఊది నట్టుంది కేంద్రం పరిస్థితి అని అంటున్నారు. అది తప్పు. వాస్తవానికి పిచ్చోని చేతిలో రాయిలా ఉంది రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి. 

ఇకపోతే మా పార్టీ నాయకులు లక్ష్మణ్  గారి మీద, కిషన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుస్తున్నారు.శవాల మీద పేలాలు ఏరుకునే మీకు ఎం తెలుస్తుంది ప్రజా సేవ చేసి ప్రజల్లో గెలవడం గురించి. 1200 మంది తెలంగాణ కోసం ప్రాణం త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది. అటువంటి తెలంగాణ పేరు చెప్పుకొని అధికారంలోకి మీరు వచ్చి కళ్ళు నెత్తికెక్కి నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు.

పేదల కడుపు నింపే బడ్జెట్ మోడీ ఇస్తే, మా జేబులు నిండటంలేదు అనే ఆవేదనతో KTR  మాట్లాడుతున్నట్లుగా కనబడుతుంది.

కేంద్రం ఇచ్చే డబ్బులతో ఆంధ్ర కాంట్రాక్టర్లను, మీ కుటుంబాన్ని పోషించుకుంటూ, కేంద్రం వలన ప్రజలకు ఎం జరుగుతుంది అని అంటారా?

హైదరాబాద్ ,వరంగల్,కరీంనగర్ లను  అంతర్జాతీయ నగరాలుగా తీర్చిదిద్దుతామని చెప్పిన KTR గారు నెలకోసారి అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తే అంతర్జాతీయ నగరాలు  నిర్మాణమవుతయా?

హైద్రాబాద్లో గుంత కనబడితే లక్ష ఇస్తామన్నారు ఆలా కనుక ఇస్తే మీ బడ్జెట్ కూడా సరిపోదు. అది మీ మునిసిపల్ పాలన.

మున్సిపల్ మంత్రిగా మీరు మున్సిపాలిటీలకు ,కార్పొరేషన్లకు ఇచ్చిన నిధులు ఎన్ని?వరంగల్  నగరానికి గత రెండు బడ్జెట్లలో ౩౦౦ కోట్లు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి ఇవ్వలేదు.కేంద్రం సహకారంతోని నడుస్తున్న 23 పథకాల్లో కనీసం నిధుల UTILIZATION CERTIFICATE లు కూడా ఇవ్వడం లేదు. మీరా మమ్మల్ని విమర్శించేది?

పంచాయత్ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాలకు ఎం ఓరుగబెట్టావు? గ్రామాలకు ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వడం లేదని మేము ప్రశ్నిస్తే పంచాయత్ రాజ్ శాఖ నుండి పారిపోయిన మీరు నేడు కేంద్రాన్ని విమర్శిస్తారా?

మీరు పెట్టె బడ్జెట్లో 60 శాతం నిధులను కూడా ఖర్చు చేయడం లేదు. కేంద్రం పెట్టె బడ్జెట్లో 105 శాతం నిధులు ఖర్చు చేస్తున్నది.అటువంటి మీకు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత ఉందా అసలు?

కాబట్టి మంత్రులు స్థాయికి తగ్గట్టుగా మాట్లాడితే బాగుంటుంది అని బీజేపీ హితువు పలుకుతుంది.

By sources

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!