మోది దెబ్బకు దిగి వచ్చిన కెనడా ప్రధాని. ఏట్టకేలకు స్వాగతం పలికిన ప్రధాని
ఆరు రొజుల పర్యటన నిమిత్తం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూదేవ్ భారత్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఖలిస్థాన్ ఉద్యమకారులకు కెనడాలొ ఆశ్రయం కల్పిస్తుండటంతొ ….. పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ (కాంగ్రెస్), ఖలిస్థాన్ తీవ్రవాదులకు కెనడా ఆశ్రయం కల్పిస్తుందని, వారిపై చర్యలు తీసుకొవాలని జస్టిన్ ట్రూదేవ్ ను డిమాండ్ చేశారు . దానికి జవాబుగా జస్టిన్ ట్రూదేవ్, తన భారత పర్యటనలొ పంజాబ్ వెళ్లనని, సియం అమరేందర సింగ్ ను అసలు కలవనని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
దీనితొ పార్టీ ఏదైనప్పటికీ, భారతీయుడైన అమరేందర్ సింగ్ ను అవమానించినందుకు, భారత ప్రధాని నరేంద్రమోది భారత పర్యటనకు వచ్చిన జస్టిన్ ట్రూదేవు ను కలవకపొగా, కనీసం ట్విట్టర్ లొ కూడా స్వాగతం చెప్పలేదు. చివరికి కెనడా ప్రదానికి స్వాగతం పలకడానికి కనీసం ఏ క్యాబినెట్ మినిస్టర్ ను కూడా వెళ్లకపొవడం విశేషం. పైగా కొన్ని కార్యక్రమాలను రద్దు చేశారు. ట్రూదేవు మొన్న గుజరాత్ వెళ్ళినప్పటికి, మొది స్పందించలేదు. కెనడా ప్రదాని ట్రూదేవు, తాజ మహల్ సందర్శనానికి వెళ్ళినపుడు, యోగి ఆధిత్యనాధ్ బదులు, మరీ దారుణంగా ఆగ్రా కలక్టర్ స్వాగతం పలికారు. దీనితొ జస్టిన్ ట్రూదేవు కు విషయం స్పష్టంగా అర్ధమైంది
దీనికి తొడు మొన్న కెనడా ప్రధాని, ముంబాయిలొ ఇచ్చిన విందులొ ఖలిస్థాన్ తీవ్రవాది జస్పాల్ అత్వాల్ కూడా పాల్గొనడంతొ, తీవ్ర దుమారం చెలరేగింది. అయితే ఖలిస్థాన్ తీవ్రవాది జస్పాల్ అత్వాల్ పాల్గొన్న విషయాన్ని, మీడియా ద్వారా తెలుసుకున్న జస్టిన్ ట్రూదేవ్, వెంటనే ఆ విందు ను క్యాన్సిల్ చేశారు.
ఈ విషయం పై కెనడా ప్రధాని మాట్లాడుతూ “జస్పాల్ అత్వాల్ ను ఏవరు ఆహ్వానించారొ తనకు నిజంగా తెలియదని, దీనిని తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నామని, దీనికి కారణమైన వారిని ఖచ్చితంగా శిక్షించితీరుతామని తెలియజేశారు. భారతదేశ సమగ్రతను తాము గౌరవిస్తున్నామని, భారత్ పై తమ ఆలొచనలొ మార్పు లేదని, United India నినాదానికే కెనడా కట్టుబడి ఉందని ఆయన తెలియజేశారు. భారత్ ను విభజించడానికి ప్రయత్నించే వారిని, హింసను ప్రేరేపించేవారికి మద్దత్తు పలకబొమని స్పష్టం చేశారు. అంతేకాకుండా జస్పాల్ అత్వాల్ ను ఈ విందుకు ఆహ్వానించిన కెనడా సెనెటర్ “రాణదీప్ సరాయ్” చేత భారతదేశానికి క్షమాపణలు చెప్పించారు
దీనితొ శాంతించిన భారత ప్రధాని నరేంద్రమోది …. జస్టిన్ ట్రూదేవు భారత్ వచ్చిన ఐదవ రొజు అనగా నిన్న ట్రూదేవు కు స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశారు. ఈ రొజు కెనడా ప్రధానిని కలుస్థానని తెలియజేశారు.
By sources
Comments
Post a Comment