పంజాబ్ నేషనల్ బ్యాంకు అవినీతి కేసు: నీరవ్ మోడీ గురించి తెలుసుకుందాం

పంజాబ్ నేషనల్ బ్యాంకు అవినీతి కేసు బయటకు రాగానే ఇప్పుడు అందరి దృష్టి  దానికి బాధ్యుడైన నీరవ్ మోడీ మీద పడింది. 
 
– గుజరాతీ కుటుంబంలో జన్మించిన నీరవ్ మోడీ మల్టీ మిలీనియర్ వజ్రాల వ్యాపారస్తుడు. దేశంలోని ఢిల్లీ, ముంబై నగరాలతో లండన్, న్యూయార్క్, హాంగ్ కాంగ్ వంటి  అంతర్జాతీయ నగరాల్లోనూ ఫైర్ స్టార్ డైమండ్ పేరిట వజ్రాల డిజైనింగ్ కంపెనీలు స్థాపించాడు. 
 
– ఫార్చ్యూన్ ఇండియా కథనం ప్రకారం 2015 సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో అతడి మొదటి స్టోర్ ప్రారంభోత్సవానికి డోనాల్డ్ ట్రంప్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. 
 
– 2017 ఫోర్బ్స్ అత్యంత పిన్న వయస్కులైన్ భారతీయ వ్యాపారస్థుల్లో నీరవ్ ఒకడు.
 
– అతడి కుటుంబం భారత్ లోనే ఉన్నప్పటికీ అతడు మాత్రం ప్రపంచ వజ్రాల వ్యాపారానికి కేంద్రం అయిన బెల్జియంలో పెరిగాడు. వార్టాన్ బిజినెస్ స్కూల్ లో చదువుని మధ్యలోనే వదిలేసి భారత వచ్చేశాడు. 
 
– మేనమామ దగ్గర వజ్రాల వ్యాపారపు మెలకువలు తెలుసుకున్న నీరవ్ ఆ తరువాత నీరవ్ మోడీ జ్యూయలరీ పేరిట ఒక కంపెనీ నెలకొల్పాడు. అంతర్జాతీయంగా అనేకమంది ఆ కంపెనీకి వినియోగదారులు ఉండేవారు. 
 
– బుధవారం పంజాబ్ నేషనల్ బ్యాంక్ గుర్తించిన 1.77 బిలియన్ డాలర్ల అవినీతిలో నీరవ్ పాత్ర ఉన్నట్టు స్పష్టం చేసింది. ఇతర భారతీయ ఋణదాతల నుండి విదేశీ రుణాల కోసం తమ బ్యాంక్ శాఖ నుండి మోసపూరితంగా లేఖలు సంపాదించినట్టు ప్రధాన అభియోగం.
 
– ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న 10 మంది అవినీతి అధికారులను పంజాబ్ నేషనల్ బాంక్ సస్పెండ్ చేసి, కేసు విచారణ కోసం సీబీఐని ఆశ్రయించింది. 
 
– ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్న గీతాంజలి, గిన్నీ, నక్షత్ర రిటైల్ స్టోర్ల మీద కూడా విచారణ జరుగుతోం
By sources

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!