భారత వ్యతిరేకులతో మీటింగులా? రాహుల్‌కి మోదీ చురకలు...

 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. డోక్లాం ప్రతిష్టంభన కొనసాగుతుండగానే రాహుల్ చైనా రాయబారితో ఎందుకు సమావేశమయ్యారంటూ దుయ్యబట్టారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘ఓ వైపు దేశం డోక్లాం సమస్యపై పోరాడుతుంటే... మీరు మాత్రం చైనా వాళ్లతో సమావేశాలు పెట్టుకున్నారు..’’ అని చురకలు వేశారు. జనవరి 5న రాహుల్ గాంధీ చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి బృందంతో సమావేశమైన సంగతి తెలిసిందే. కాగా నిరర్ధక ఆస్తుల వ్యవహారంపై ప్రధాని స్పందిస్తూ... ఈ కుంభకోణం వెనుక వందశాతం కాంగ్రెస్ పార్టీనే ఉందని ప్రజలు తెలుసుకోవాలన్నారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!