ద్వాపరయుగం నాటి పూర్వవైభవం సంతరించుకొనున్న “శ్రీకృష్ణుని గొవర్ధనగిరి” పర్వతం
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గొవర్ధగిరి పర్వతం గురించి తెలియని వారుండరు. ఇన్నాళ్ళూ నిర్లక్ష్యం కాబడిన ఈ పర్వతం ఇప్పుడు పూర్వ వైభవాన్ని సంతరించుకోనుంది. ఈ గొవర్ధనగిరి పర్వతం ఉత్తరప్రదేశ్ లొని మధుర జిల్లా లొ బృందావనం దగ్గరలొ ఉంది. బృందావనం, గొవర్ధనగిరి ప్రాంతాలు చిన్నప్పుడు శ్రీకృషుడు పెరిగిన, ఆడుకున్న ప్రదేశాలు.
గోవర్ధనం అనగా గోవుల్ని వర్ధనం అనగా వృద్ధిచేయడం అని అర్ధం. శ్రీకృష్ణుడు యదుకులంలో ఉండగా ఒకసారి దేవేంద్రుడు యాదవులపై కోపించి కుండపోతగా వర్షం కురిపించాడు. అపుడు వారు శ్రీకృష్ణుని వేడుకొనగా తన చిటికెని వేలితో ఈ పర్వతాన్ని ఎత్తితే వారంతా ఆ వర్షం తగ్గే వరకూ దాని నీడన తలదాచుకొంటారు. అప్పటి నుండి ఈ పర్వతాన్ని పవిత్రంగా భావించేవారు.
.
.
అయితే అనేక శతాబ్దాలుగా నిర్లక్ష్యం చేయబడి ఈ పవిత్రమైన గొవర్ధగిరి పర్వతం , ఇప్పుడు యోగి ఆధిత్యనాధ్ గారి చొరవతొ మరలా పునర్వైభవం పొందనుంది. ఇప్పుడు ఈ పర్వతాన్ని మరలా ద్వాపరయుగం కాలాన్ని గుర్తు చేసేలా అభివ్రుధి చేయనున్నారు. ఈ పర్వతంతొ పాటు, దాని చుట్టు పక్కల 21 కిలొమీటర్ల పరిధిలొ …. ద్వాపరయుగం కాలం నాటి …. గుబురు పొదలు, కొలనులు, వృక్షాలు, పూల తొటలను అభివృధి చేయనున్నారు.
ఇందుకొసం ద్వాపరయుగం కాలం నాటి ఐదు రకాల వృక్షజాతులైన కదంబ, కరొలి, తమల్, పక్కడ్, తిల్కాన్ వృక్షాలను ఇక్కడ పెంచనున్నారు. శ్రీకృష్ణుడు, తన చిన్న తనలొ కదంబ చెట్టుపై కూర్చుని పిల్లనగ్రొవి వాయించేవారుట. అంతేకాకుండా ఈ చెట్ల నీడనే శ్రీకృష్ణుడు, తన మిత్రులతొ కలిసి అడుకునేవారని భాగవతంలొ పేర్కొనిఉంది. దీనితొ ఇప్పుడు ఈ గొవర్ధన గిరి పర్వతాన్ని మరలా పూర్తిగా శ్రీకృష్ణుని కాలం నాటి గొవర్దనగిరి పర్వతం వలే మార్చి వేయనున్నారు. ఇందుకొసం ప్రత్యేకంగా రాజస్థాన్ నుండి కొన్ని పురాతన వృక్షజాతులను తెప్పించారు.
యోగి ఆధిత్యనాధ్ గారు, ఈ ప్రాజెక్టును స్వయంగా పర్యవేక్షించనున్నారు. కాగా ఈ ప్రాజెక్టును చేపడుతున్న ప్రభుత్వ సంస్థ Brij Tirath Vikas Parishad కు ఇప్పటికే మొదటి విడతగా 226 కొట్లు విడుదల చేయడం విశేషం.
By sources
Comments
Post a Comment