పవన్‌కల్యాణ్ కీలక నిర్ణయం?

పవన్‌కల్యాణ్ కీలక నిర్ణయం?

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా?, ఢిల్లీ స్థాయిలో తన ప్రతాపాన్ని చూపించాలనుకుంటున్నారా? దేశ రాజధాని వేదికగా మోదీ ప్రభుత్వాన్ని ఢీకొనాలని నిర్ణయం తీసుకున్నారా? అవుననే సమాధానం వస్తోంది. కొద్ది రోజులుగా బీజేపీ వర్సెస్ టీడీపీ మధ్య జరుగుతున్న పరిణామాలే దీనికి కారణమని తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందంటూ పార్లమెంట్‌లోనూ, బయటా ఎంపీలు పోరాటం చేస్తున్నా..కేంద్రం పట్టించుకోకపోవడంతో ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేయాలని పవన్‌కల్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ వైఖరిని నిరసిస్తూ జంతర్‌మంతర్ వేదికగా ఈ దీక్ష చేయనున్నట్లు సమాచారం. కాసేపట్లో పవన్‌కల్యాణ్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో మోదీతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్...మోదీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!