నేను నిరంతరం విద్యార్థినే : మోదీ
నేను నిరంతరం విద్యార్థినే : మోదీ
దేశంలో విప్లవాత్మక మార్పులు యువత ద్వారానే సాధ్యమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో ఏర్పాటు చేసిన పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. విద్యార్థులతో చర్చా గోష్టి నిర్వహించారు. పరీక్షల ఒత్తిడిని అధిగమించడంపై మోదీ సూచనలు చేశారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ.. దేశ ప్రధానితో మీరు మాట్లాడటం లేదని ఆయన అన్నారు. మీరు ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించి.. విద్యార్థుల ముఖాల్లో నవ్వులు పూయించారు. నేను నిరంతరం విద్యార్థినే.. ఈ రోజు నాకు పరీక్ష అని పేర్కొన్నారు. ఈ పరీక్షలో పది మార్కులకు మీరు ఎన్ని మార్కులు వేస్తారని విద్యార్థులను మోదీ చమత్కారంగా ప్రశ్నించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల శ్రమలో లోపం ఉండదన్నారు. పాఠ్యాంశాలు తరచూ విద్యార్థుల మదిలో మెదులుతూనే ఉంటాయని గుర్తు చేశారు.దేవతలను పూజించాలని విద్యార్థులకు పెద్దలు సూచిస్తారు. కానీ ఆత్మవిశ్వాసం లేకపోతే దేవతలు కూడా ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. ఆత్మ విశ్వాసంతో కఠిన పరీక్షల్లోనూ విజయం సాధించవచ్చు అని సూచించారు. ఏదైనా పని చేస్తానని పూనుకుంటే.. సాధించే వరకు వదిలిపెట్టొద్దని మోదీ విద్యార్థులకు చెప్పారు.
By sources
Comments
Post a Comment