కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ క్లాస్..!

కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ క్లాస్..!

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఆప్ ఎమ్మెల్యేలు చేయి చేసుకున్న వ్యవహారం ముదురుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన సహచర మంత్రులకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ క్లాస్ పీకారు. ప్రభుత్వ ఉన్నతాధికారిపై దాడి దురదృష్టకరమని, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని ఆయన తెగేసి చెప్పారు. ఈ విషయాని బైజల్ ఓ ట్వీట్‌లో తెలియజేశారు.
 
గౌరవనీయ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సహచరులను కలుసుకున్నాననీ, ఇటీవల జరిగిన దురదృష్టకర ఘటనలను తీవ్రంగా ఖండించానని బైజల్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లోని అపనమ్మకాన్ని తొలగించేందుకు ఎన్నికైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అప్పుడే ఢిల్లీ అభివృద్ధికి ఎలాంటి అవరోధాలు ఉండవని తాను చెప్పినట్టు తెలిపారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్న విషయాన్ని స్పష్టం చేశానని అన్నారు. మరోవైపు, కేజ్రీవాల్ సైతం లెఫ్టినెంట్ గవర్నర్‌తో సమావేశమైన అనంతరం ఓ ట్వీట్‌లో ఆ విషయాలను పంచుకున్నారు. అధికారులు గత మూడు రోజులుగా విధులకు హాజరుకావడం లేదని, దీంతో ప్రభుత్వ పాలనకు ఇబ్బంది కలుగుతున్న విషయం తాను లెఫ్టినెంట్ గవర్నర్ దృష్టికి తెచ్చినట్టు కేజ్రీవాల్ చెప్పారు. ఆఫీసర్లు యథాప్రకారం విధులకు హాజరయ్యేలా చూస్తానని ఎల్జీ హామీ ఇచ్చారని తెలిపారు. కేబినెట్ మంత్రులు సైతం అధికారులకు తమ నుంచి పూర్తి సహకారం ఉంటుందని, కలిసికట్టుగా ఢిల్లో పురోభివృద్ధికి పాటుపడతామని ఎల్జీకి వివరించినట్టు కేజ్రీవాల్ ఆ ట్వీట్‌లో తెలిపారు.
By sources

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!