శ్రీదేవి భౌతికకాయం అప్పగింతపై తాజా అప్డేట్
శ్రీదేవి భౌతికకాయం అప్పగింతపై తాజా అప్డేట్
అతిలోకసుందరి, లెజండరీ నటి శ్రీదేవి హఠాన్మరణంతో యావత్ సినీ ప్రపంచం మూగబోయింది. ఆమెను కడసారి చూసేందుకు నటీనటులు.. కనీసం టీవీల్లోనైనా చూద్దామని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఆమె మరణంపై నిమిషానికో సంచలన నిజం బయటపడుతుండటంతో భౌతికకాయం అప్పగింతపై ఆలస్యమవుతోంది.
సోమవారం సాయంత్రం భౌతికకాయం ముంబైకి వచ్చేస్తుందనుకున్నప్పటికీ సాధ్యం కాలేదు. శ్రీదేవి భర్తను పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ విచారించడంతో మరింత ఆలస్యమయింది. దీంతో భౌతికకాయం అప్పగింతపై సస్పెన్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతేకాదు ఎంతటైం పడుతుందో చెప్పలేమంటూ దుబాయ్‌లోని భారత అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరికొన్ని అనుమతులు రావాల్సి ఉందని భారత రాయబారి చెబుతున్నారు. ప్రస్తుతం బోనీ కపూర్ హోటల్ గదిలోనే ఉన్నారు. కేసుకొలిక్కి వచ్చేవరకు దుబాయ్ విడిచివెళ్లొద్దని ఆయన్ను పోలీసులు ఆదేశించారు. బోనీకపూర్ పాస్‌పోర్టును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
By sources
Comments
Post a Comment