ఏపీకి మరోసారి మొండిచేయి చూపించిన అరుణ్‌జైట్లీ
ఏపీకి మరోసారి మొండిచేయి చూపించిన అరుణ్‌జైట్లీ
ఆర్ధికమంత్రి అరుణ‌్‌జైట్లీ ఏపీకి మరోసారి మొండిచేయి చూపారు. రాజ్యసభలోనూ జైట్లీ ఏపీ సమస్యలపై కీలక ప్రకటన చేస్తారని ఏపీ ప్రజలు, ఎంపీలు వేయికళ్లతో వేచి చూశారు. అయితే ఆయన ఎలాంటి ప్రకటన చేయకపోగా పాత పాటే పాడారు. లోక్‌సభలోని సీన్ రాజ్యసభలోనూ పునరావృతమైంది. లోక్‌సభలో చెప్పిన విషయాలనే రాజ్యసభలోనూ మళ్లీ సేమ్ టూ సేమ్ రిపీట్ చేశారు.
శుక్రవారం మధ్యాహ్నం జైట్లీతో రెండున్నర గంటలపాటు కేంద్రమంత్రి సుజనాచౌదరి చర్చించారు. రాజ్యసభలోనైనా మార్పు వస్తుందని టీడీపీ ఎంపీలు ఆశించారు. జైట్లీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఎంపీలు తీవ్ర నిరాశకు గురయ్యారు. విభజన సమయంలో ఏపీకి న్యాయం చేయాలని కోరామని, విభజన కారణంగా ఏపీ భారీగా ఆదాయం కోల్పోయిందని చెప్పారు. రాజధాని, పోలవరం, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇచ్చామని, రెవెన్యూలోటు ఎంత అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. రైల్వేజోన్, దుగరాజపట్నం పోర్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ.. పారిశ్రామిక కారిడార్‌పై ఆయా శాఖలు పరిశీలిస్తున్నాయని జైట్లీ తెలిపారు. కొత్త విషయాలు ప్రకటించకుండా ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
By sources
Comments
Post a Comment