పీఎన్‌బీ స్కామ్‌పై పెదవి విప్పిన జైట్లీ
పీఎన్‌బీ స్కామ్‌పై పెదవి విప్పిన జైట్లీ
పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటుచేసుకున్న రూ.11,400 కోట్ల కుంభకోణంపై కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ తొలిసారి పెదవి విప్పారు. ఆడిటర్లు, మేనేజిమెంట్ దీనికి భాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు పేరును కానీ, ఆ బ్యాంకుకు బురిడీ కొట్టి విదేశాలకు చెక్కేసిన ప్రధాన సూత్రధారి నీరవ్ మోదీ పేరును కానీ జైట్లీ ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారు. అవకతవకలను గుర్తించడంలో ఆడిటర్లు విఫలమవుతున్నారంటూ నిందించారు. అలాంటి అవకతవకలను కనిపెట్టేందుకు అవసరమైన సిస్టమ్‌ను సూపర్వైజరీ ఏజెన్సీలు రూపొందించుకోవాలన్నారు. ఇలాంటి అవకతవకలను సూపర్వైజరీ ఏజెన్సీలు మొగ్గలోనే గుర్తించి తుంచేస్తే... అవి పునరావృతం కావని ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు. నిర్ణయాలు తీసుకునే అధికారం బ్యాంకు మేనేజిమెంట్‌కు ఉన్నప్పుడు సమర్ధవంతంగా దాన్ని ఉపయోగించుకోవాలని, లోపాలు గుర్తిస్తే వారే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఏడీఎఫ్ఐఏపీ వార్షిక సమాశంలో జైట్లీ వ్యాఖ్యానించారు.
By sources
Comments
Post a Comment