శ్రీదేవి ఉన్న చోట ఎలా ఉంటుందో ఊహిస్తూన
శ్రీదేవి ఉన్న చోట ఎలా ఉంటుందో ఊహిస్తూన
శ్రీదేవి రాకతో స్వర్గంలో పండగ వాతావరణం
రంభ ఊర్వశి మేనక తిలోత్తమల మధ్య పెరిగిన పోటీ
శ్రీదేవిని చూసి పండగ చేసుకుంటున్న ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు
ప్రేమాభిషేకం సినిమాని మళ్లీ రీమేక్ చేసే పనిలో దాసరి. ఒకే చెప్పిన అక్కినేని.
అతిలోకసుందరిని సీతగా చూపిస్తానంటున్న బాపు రమణ. వెంటనే షూటింగ్ మొదలుపెట్టమన్న ఎన్టీఆర్.
వసంత కోకిల 2 కోసం స్క్రిప్ట్ సిద్దం చేస్తున్న దర్శకుడు బాలచందర్.
వెల్లువొచ్చి గోదారమ్మ పాట కోసం యముడ్ని బిందెలు అడుగుతున్న శోభన్ బాబు. పాట చెడగొడదామని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య. బంగారు బిందెలయిన పర్వాలేదు. డబ్బులు నేను పెట్టుకుంటానంటున్న డి. రామానాయుడు.
ఇంత కాలానికి ఆడతోడు దొరికిందని సంతోష పడతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.
28 ఏళ్ల తరువాత ఇంద్రజ స్వర్గ లోకానికి రావడంతో పార్టీ చేసుకుంటున్న తండ్రి ఇంద్రుడు. మళ్ళీ ఉంగరం పడేస్తాదేమొనని.. శ్రీదేవి దగ్గర నుంచి ఉంగరం తీసేసుకున్న ఇంద్రుడు.
🙏
Comments
Post a Comment