“మరో వివాదంలో బాలీవుడ్ “మణికర్ణిక చిత్రాన్ని అడ్డుకుంటాం”: సర్వ బ్రాహ్మణ మహాసభ హెచ్చరిక –
‘పద్మావత్’ వివాదం ఇంకా పూర్తిగా సద్దుమణగక ముందే మరో వివాదం బాలీవుడ్ మెడకు చుట్టుకుంది. ఈసారి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నిర్మాణం అవుతున్న ‘మణికర్ణిక: ది క్వీన్ అఫ్ ఝాన్సీ’ చిత్రంపై వివాదం ముసురుకుంది.
ఝాన్సీ లక్ష్మీభాయి జీవితచరిత్ర నేపధ్యంగా రాజస్థాన్ లో తీస్తున్న ఈ చిత్ర నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని సర్వ బ్రాహ్మణ మహాసభ డిమాండ్ చేసింది. ఝాన్సీ లక్ష్మీభాయ్, బ్రిటిష్ పౌరుడికి మధ్య కల్పిత ప్రేమాయణం సృష్టించి చరిత్రను వక్రీకరిస్తున్నారని మహాసభ అధ్యక్షుడు సురేష్ మిశ్రా ఆరోపిస్తున్నారు.
ఇంగ్లాండ్ కు చెందిన ప్రవాస భారతీయుడు రాసిన పుస్తకం ‘రాణి’ ఆధారంగా ఈ చిత్రం నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఐతే చారిత్రక వక్రీకరణలు ఉన్నాయంటూ ఆ పుస్తకాన్ని 2008లో యూపీలోని అప్పటి మాయావతి ప్రభుత్వం నిషేధించింది. నిషేధించబడిన పుస్తకం ఆధారంగా సినిమా నిర్మిస్తారని సురేష్ మిశ్ర ప్రశ్నిస్తున్నారు
Comments
Post a Comment