రేణుకా చౌదరిపై కాంగ్రెస్ గరం గరం
రేణుకా చౌదరిపై కాంగ్రెస్ గరం గరం
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వ్యవహార శైలిని ఆ పార్టీ నేత తెహసీన్ పూనావాలా తీవ్రంగా విమర్శించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం రాజ్యసభలో మాట్లాడుతున్న సమయంలో ఆమె ప్రవర్తన సక్రమంగా లేదని వ్యాఖ్యానించారు. పెద్దల సభలో నవ్వులు తన శరీరాన్ని నలగ్గొట్టినట్లయిందని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.
‘‘కాంగ్రెస్‌కు గట్టి మద్దతుదారునైన నేను నిజాయితీగా చెప్తున్నాను, రేణుకా చౌదరీలు, మణిశంకర్ అయ్యర్లు పార్టీకి భారమని అంగీకరించాలి. వాళ్ళ అహంకారం కాంగ్రెస్‌ను నష్టపరుస్తోంది. ఇది గాంధీ, నెహ్రూ, యోధుల పార్టీ... పెద్దల సభలో ఆ నవ్వు నా శరీరాన్ని నలగ్గొట్టినట్లయింది’’ అని తెహసీన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
రాజ్యసభలో బుధవారం ప్రధాని మోదీ మాట్లాడుతూ ఆధార్ గురించి ప్రస్తావించినపుడు రేణుకా చౌదరి నవ్విన సంగతి తెలిసిందే.
By Sources Andhra Jyothi
Comments
Post a Comment