జగన్ రాజీనామా అస్త్రం డ్రామా అసలు కథ ఇదేనా?
జగన్ రాజీనామా అస్త్రం డ్రామా అసలు కథ ఇదన ?
తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన కేసీఆర్ తీరు గుర్తుందా? ఉప ఎన్నికల్ని తీసుకొచ్చి.. ఉద్యమస్ఫూర్తిని రగిలించటంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఉప ఎన్నికలతో ఉద్యమాన్ని తర్వాత లెవెల్‌కు తీసుకెళ్లేందుకు అనువుగా ఉన్న ఏ చిన్న అవకాశాన్ని కేసీఆర్ వదిలిపెట్టలేదు. ఎలాంటి డెడ్ లైన్లు లేకుండా.. ఉన్న ఫళంగా రాజీనామాల మీద రాజీనామాలు చేసే తీరు కేసీఆర్ లో కనిపిస్తుంది. రాజీనామా అస్త్రం అన్నది ఉరుము మెరుపు లేని పిడుగులా ఉండాలే కానీ.. అందరికి చెప్పి.. ఫలానా డేట్ అంటూ గడువు ఇచ్చి.. అప్పటికి కేంద్రం మా మాట వినకుంటే రాజీనామా చేస్తామని చెప్పటం అంటే.. దాని వెనుక పెద్ద వ్యూహమే ఉంటుంది. తాజాగా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఇందుకు మినహాయింపు కాదు.
ఎప్పటికప్పుడు సీజనల్ గా ప్రత్యేక హోదా మీద గళం విప్పి.. తర్వాత కామ్ అయ్యే లక్షణం జగన్ లో ఎక్కువే. ఏపీ పరిస్థితి మారాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరి అని నమ్మే వారిలో జగన్ ఒకరిగా చెబుతుంటారు. మరి అంతగా నమ్మే వ్యక్తి.. తన ఎంపీల రాజీనామాతో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరో స్థాయికి తీసుకెళ్లొచ్చుగా అంటే.. జగన్ మాట్లాడరు. తన ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని అప్పుడెప్పుడో చెప్పి జగన్.. తాజాగా ఏప్రిల్ 5 డెడ్ లైన్ అంటే కొత్త మాటలు మాట్లాడటం తెలిసిందే. ఇంతకాలం కామ్ గా ఉన్న జగన్.. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం ప్రకటించకుంటే ఏప్రిల్ 5న తమ ఎంపీలు రాజీనామా చేయనున్నట్లుగా ప్రకటించి కొత్త చర్చకు తెర తీశారు. ఇంతకాలం రాజీనామా విషయంలో సాగతీత వైఖరిని అనుసరించిన జగన్.. ఇప్పుడు ఉన్నట్లుండి ఇంత వేగంగా ఎందుకు నిర్ణయం తీసుకున్నట్లు? అన్న క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ ఇట్టే వచ్చేస్తుంది. తమ ఎంపీల రాజీనామా ప్రకటన మొత్తం వ్యూహాత్మకంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా.. జగన్ కు పరిస్థితులు ఏ మాత్రం సానుకూలంగా లేవన్న వాదనలు వినిపిస్తున్న వేళ.. రాజీనామా విషయంలో వెనక్కి తగ్గనట్లుగా కలర్ ఇవ్వటం వెనుక జగన్ మాస్టర్ మైండ్ ఉందని చెబుతున్నారు. ఎందుకంటే.. తన పార్టీ ఎంపీలు రాజీనామా చేసినా.. లోక్ సభ స్పీకర్ వాటిని ఆమోదించకుండా ఉండటం.. ఒకవేళ ఆమోదించినా ఉప ఎన్నికలు జరిగే ఛాన్స్ లేకపోవటమే జగన్ చేత రాజీనామా మాట పలికేలా చేసిందని చెబుతున్నారు. వాస్తవానికి హోదా ఇష్యూలో తమ ఎంపీలు రాజీనామా చేస్తారని 2016 బడ్జెట్ సమావేశాల్లో చెప్పిన జగన్.. 2018 బడ్జెట్ సమావేశాల వరకూ రాజీనామా ఎందుకు చేయించలేదన్న ప్రశ్నకు ఏపీ విపక్ష అధినేత మొదలుకొని.. ఆ పార్టీ నేతలు ఎవరూ సూటిగా బదులివ్వటం లేదు. హోదా ఇస్తామంటే తాము అప్పటికప్పుడే రాజీనామా చేస్తామంటూ బీరాలు పలికిన జగన్.. గడిచిన రెండేళ్లలో హోదా గురించి ఎంతగా పోరాడారో అందరికి తెలిసిందే. తాము రాజీనామాలు చేస్తే.. లోక్ సభలో ఉండి హోదా కోసం పోరాడే వారు ఎవరు? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ జగన్ మాటలు నిజమే అని అనుకుంటే.. తాజా బడ్జెట్ సెషన్లో సభను స్తంభింపచేసింది జగన్ పార్టీ ఎమ్మెల్యేలా? ఏపీ అధికారపక్ష ఎమ్మెల్యేలా? అన్నది ఇట్టే తెలిసిపోతుంది. ఒకవేళ జగన్ చెప్పినట్లే.. హోదా విషయంలో ఆయనిచ్చిన డెడ్ లైన్ లోపు మోడీ సర్కారు రియాక్ట్ కాలేదనుకుందాం. అప్పుడేం జరుగుతుందన్న విషయం చూస్తే.. జగన్ గేమ్ ప్లాన్ ఎంత సేఫో అన్న భావన కలగటం ఖాయం. ఎందుకంటే.. జగన్ పార్టీ ఎంపీలు తమ రాజీనామాల్ని లోక్ స్పీకర్‌కు అందించిన వెంటనే.. వాటిని ఆమోదించే పరిస్థితి ఉండదు. రాజీనామా పత్రాలు ఇచ్చిన రోజు సభ వాయిదా పడుతుంది. తర్వాత ఎప్పుడైనా రాజీనామాల విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ కు ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. నిబంధనల ప్రకారం స్పీకర్ ఆమోదం పొందిన తర్వాత.. ఆర్నెల్ల వ్యవధిలో ఎన్నికల్ని నిర్వహించటం తెలిసిందే. అయితే.. ఉప ఎన్నికల్ని సార్వత్రి ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ వ్యవధిలో ఉంటే నిర్వహించరు. జగన్ చెప్పిన డేట్.. ఆ తర్వాత స్పీకర్ ఎంపీల రాజీనామాను ఆమోదించినా ఉప ఎన్నికలు జరగకుండా ఉండేలా ప్లాన్ చేయటం కనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం ఆర్నెల్ల పదవి కోసం ఉప ఎన్నికల్ని ఎదుర్కొనే సినిమా జగన్ అండ్ కోకు లేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇటీవల కాలంలో బీజేపీ ముందస్తు మీద దృష్టి సారించటం తెలిసిందే. ఒకవేళ.. అదే నిజమైతే.. ఆ యాంగిల్ లో కూడా జగన్ ఎంపీలు రాజీనామా చేసినా వారి పదవులకు ఎలాంటి ఢోకా ఉండదు. ఒకవేళ వారి రాజీనామాల్ని స్పీకర్ ఓకే చేసినా.. సార్వత్రిక ఎన్నికలు జరిగే వీలు ఉండదు. మరో విశేషం ఏమిటంటే.. హోదా ఇవ్వనందుకే రాజీనామా చేస్తున్నామంటూ కారణాలు వివరిస్తే.. ఆ రాజీనామాలు అసలే చెల్లవని చెబుతున్నారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు ఇచ్చినా కొన్ని ప్రత్యేక డిమాండ్ల కోసం రాజీనామా చేసినట్లుగా స్పీకర్ భావిస్తే.. వాటిని ఆమోదించకుండా నిలిపివేయొచ్చు. మొత్తంగా చూస్తే.. ఏ యాంగిల్ లోనూ జగన్ ఎంపీల రాజీనామా ఓకే అనే పరిస్థితి కనిపించదు. ఈ కారణంతోనే అంత ధీమాగా హోదా సాధన కోసం తమ ఎంపీలు రాజీనామా త్యాగానికి సిద్ధంగా ఉన్నట్లుగాజగన్ కలర్ ఇస్తున్నారన్న అభిప్రాయాన్ని ప
By sources
Comments
Post a Comment