ప్రియా ప్రకాశ్‌కు పడిపోయిన క్రికెటర్!
ప్రియా ప్రకాశ్‌కు పడిపోయిన క్రికెటర్!
ప్రియ ప్రకాశ్ వారియర్.. ఈ కేరళ బ్యూటీ గురించి ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక్కసారి కన్నుకొట్టి యువత హృదయాలను కొల్లగొట్టి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. యువత గుండెల్లో పాగా వేసిన ఈ చిన్నదానికి యువకులు ఫిదా అయిపోతున్నారు. ఆమె హావభావాలకు పడిపోయిన వారిలో యువకులే కాదు.. దక్షణాఫ్రికా క్రికెటర్ లుంగీ ఎంగిడి కూడా వచ్చి చేరాడు. ప్రియ నటిస్తున్న మలయాళ సినిమా ‘ఒరు ఆదార్ లవ్’ లోని ఓ పాటను ఇటీవల చిత్ర బృందం విడుదల చేసింది. ‘మాణిక్య మలరాయ పోవి’ అనే ఈ పాట విడుదలైన కాసేపటికే సంచలనంగా మారింది. వేలాదిగా షేర్లు అయ్యాయి. ఒక్క రోజులోనే 45 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ పాటలోని లవ్ సీన్‌కు యువకులు ప్లాట్ అయిపోయారు. యువకుల హృదయాల్లో గిలిగింతలు పెట్టిన ప్రియా ప్రకాశ్‌కు రాష్ట్రాలతో సంబంధం లేకుండా అభిమానులు పెరిగిపోయారు. ఇదే పాటను లుసిఫర్ అనే అభిమాని దక్షిణాఫ్రికా క్రికెటర్ ఎంగిడికి షేర్ చేశాడు. ఇది చూసిన ఎంగిడి కూడా ఫిదా అయిపోయాడు. ఆమె చూపులకు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ‘ఈ వీడియోతో నా వాలెంటైన్స్ డే పూర్తయింది’ అని ట్వీట్ చేశాడు.
By sources
Comments
Post a Comment