కేసీఆర్ పుట్టిన రోజు స్పెష‌ల్…ఏంటంటే

కేసీఆర్ పుట్టిన రోజు స్పెష‌ల్…ఏంటంటే
  

 ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టిన‌రోజు.దీనికొసం ఆయ‌న అభిమానులు,పార్టీ శ్రేణులు ఇప్ప‌టినుంచే భారీగా కార్యక్ర‌మాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.త‌మ అభిమానాన్ని ఒక్కొక్క‌రు ఒక్కోర‌కంగా చాటేందుకు,అధినేత మ‌న‌సును గెలిచేందుకు రెడీ అవుతున్నారు.ముఖ్యంగా ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్నందున జిల్లాల నేత‌లంతా త‌మ బ‌లాన్ని చాటుకునేలా,బ‌ర్డ్ డే వేడుక‌లను అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకునేందుకు ముస్తాబ‌వుతున్నారు. అయితే,డి.వి.ఆర్‌. ప్రసాద్ అనే ఒక కళాకారుడు ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై ఉన్న అభిమానాన్ని చాలా వెరైటీగా చాటుకున్నాడు.ఎలా అంటే,కేసీఆర్ పుట్టిన రోజు ఫిబ్ర‌వ‌రి,17,1954.దీన్ని ఆధారంగా క‌రెన్సీ నోట్ల‌పై కేసీఆర్ బ‌ర్త్ డేకు సంబంధించిన అంకెలు(170254)వ‌చ్చేలా 1,2,5,10,20,50,100 రూపాయ‌ల నోట్ల‌ను సేక‌రించాడు.ఆ నోట్ల‌పై 170254 అనే నెంబ‌ర్ ఉండ‌టం ప్ర‌త్యేక‌త‌. దీన్ని డిప్యూటీ సీఎం మ‌హ్మ‌ద్ అలీకి అంద‌జేసి కేసీఆర్ కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేశాడు. ఈ విష‌యం తెలుసుకున్న హెరిటేజ్ బుక్ ఆఫ్ ఇండియా ప్ర‌తినిధులు హెరిటేజ్ బుక్ ఆఫ్ ఇండియాలో స్థానం క‌ల్పించారు. 

  మ‌రికొంద‌రు పార్టీ నేత‌లు కూడా త‌మ‌త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో భారీ కేక్ క‌టింగ్స్,అన్న‌దాన కార్య‌క్ర‌మాలు,ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో పండ్ల పంపిణీ వంటి కార్య‌క్ర‌మాల‌ను పెద్ద ఎత్తున చేప‌ట్ట‌నున్నారు.ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఆశిస్తున్న నేత‌లు భారీ కార్య‌క్ర‌మాల‌కు రంగం సిద్దం చేసుకుంటున్నారు.ఇక 17న సీఎం కేసీఆర్ పై ప్ర‌త్యేక‌మైన పాట‌ను విడుద‌ల చేసేందుకు ఓ టీం క‌స‌ర‌త్తులు చేస్తోంది.ఇప్ప‌టికే “వీరాధి వీరుడు అతడు.. విజయానికి బావుట అతడు…. ఆలోచన శిఖరం అతడుష అంటూ టీజ‌ర్ ను రిలీజ్ చేయ‌డం జ‌రిగింది.ఈ సాంగ్ ను 18మంది సింగ‌ర్స్ తో ప్లాన్ చేయ‌డం విశేషం.గ‌తేడాది రిలీజ్ చేసిన బందూక్ డైరెక్ట‌రే ప్ర‌స్తుతం కూడా ఈ పాట‌ను సిద్దం చేశారు.టీజ‌ర్ విడుద‌లైన కానుంచి ఈ పాట‌కోసం కేసీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
By sources

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!