టీఆర్ఎస్ లో ముగ్గురు…వైసీపీలో ఒక్క‌డు…?

రెండు రాష్ట్రాల్లో పార్టీలు త‌మ బ‌లాబ‌లాల‌ను చూపించుకునే ప‌నిలో ప‌డ్డాయి. త్వ‌ర‌లోనే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.దీనిక‌న్నా ముందు రాజ్య‌స‌భ ఎన్నిక‌లు రానున్నాయి.ఏపీలో మూడు సీట్ల‌కు,తెలంగాణ‌లోనూ మూడు సీట్ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.ఇక తెలంగాణ‌లో వార్ వ‌న్ సైడే కాబ‌ట్టి ఆ మూడింటిలోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు ఏక‌గ్రీవంగా ఎన్నిక కావ‌టం లాంఛ‌న‌మే అంటున్నారు నిపుణులు.ఇక ఏపీలో మాత్రం కాస్త నైరాశ్యం నెల‌కొంది.
ఖాళీ కానున్న మూడింటిలో రెండు సీట్లు అధికార టీడీపీకి,ఒక స్థానం ప్ర‌తిప‌క్ష వైసీపీకి ద‌క్కే అవ‌కాశం ఉంది.కానీ వైసీపీ ఒక్క సీటుకూడా గెల‌వ‌కూడ‌ద‌నే వ్యూహంలో టీడీపీ అధిష్టానం చ‌క్రం తిప్పుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద‌క్కించుకునే ఆ ఒక్క స్థానానికి గాను నెల్లూరు జిల్లాకు చెందిన బిజినెస్ మాన్ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డిని రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి.ఇక ఈయ‌న గెలుపుకు 44 ఎమ్మెల్యేల ఓట్లు అవ‌స‌రం కానుంది.ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 45.కాబ‌ట్టి ఖ‌చ్ఛితంగా తాము రాజ్య‌స‌భ స్థానాన్ని గెలుస్తామ‌న్న భ‌రోసాలో ఉన్నారు వైసీపీ నాయకులు.ఇక మిగిలిన రెండు సీట్ల‌లో టీడీపీ అధిష్టానం ఎవ‌ర్నీ ప్ర‌క‌టిస్తుందో తెలియాల్సి ఉంది.ఆ రెండు సీట్ల కోసం చాలామంది పోటీ ప‌డుతున్నారు.
ఇక తెలంగాణ‌లో ఖాళీ కానున్న మూడు రాజ్య‌స‌భ స్థానాల్లో టీఆర్ఎస్ ఏక‌గ్రీవంగా గెలుచుకోనుంది.అయితే ఏక‌గ్రీవంగా ఎన్నిక కానున్న ఆ ముగ్గురు అభ్య‌ర్థులు ఎవరా అన్న చ‌ర్చ జోరుగా న‌డుస్తోంది.టీఆర్ఎస్ వ‌ర్గాల అభిప్రాయం మేర‌కు ముగ్గురు మూడు సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారు అన్న సంగ‌తి ఇప్ప‌టికే తేలిపోయింది.వారిలో యాద‌వ,వెల‌మ‌,రెడ్డి సామాజిక వ‌ర్గాలు ఉన్న‌ట్లు అన‌ధికారిక స‌మాచారం.
యాద‌వ సామాజిక వ‌ర్గం నుంచి నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ నోముల న‌ర్సింహ‌య్య పేరు దాదాపుగా ఖ‌రారు అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.రెడ్డి సామాజిక వ‌ర్గం నుంచి షేరి సుభాష్ రెడ్డి,వెల‌మ సామాజిక వ‌ర్గం నుంచి జోగునప‌ల్లి సంతోష్ కుమార్ పేర్లు ఫైన‌ల్ అయిన‌ట్లు టీఆర్ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి.
జోగున‌ప‌ల్లి సంతోష్ కుమార్ కేసీఆర్ కు అత్యంత స‌న్నిహితుడు.ఒక‌ర‌కంగా చెప్పాలంటే కేసీఆర్ నీడ అని చెప్పాల్సిందే.ఈయ‌న్ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో వేముల‌వాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీకి దింపుతార‌ని ప్ర‌చారం జ‌రిగింది కానీ,ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి ప‌ద‌వి ఇవ్వాల్సి ఉంట‌ది.ఇప్ప‌టికే కేసీఆర్ ఫ్యామిలీ ఆయ‌న‌తో పాటు కేటీఆర్,హ‌రీష్ రావులు క్యాబినెట్లో ఉన్నందున‌,జోగున‌ప‌ల్లి(ఇంటి స‌భ్యుడే) కి కూడా ఇస్తే ప్ర‌తిప‌క్షాల మాట‌ల తూటాలు త‌ట్టుకోవ‌టం క‌ష్ట‌మ‌వుతుంది.కాబ‌ట్టి జోగున‌ప‌ల్లిని రాజ్య‌స‌భకు పంప‌టం ద్వారా కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టిన‌ట్లు అవుతుందని కేసీఆర్ భావిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.ఇక ఈ ముగ్గురు పేర్లు దాదాపు ఖ‌రారైన‌ట్లే అంటున్నారు పార్టీ మిత్రులు.
By sources

Comments