ఎత్తుకు పైఎత్తు వేసిన టీడీపీ.. నెల ముందే రాజీనామాలు
ఎత్తుకు పైఎత్తు వేసిన టీడీపీ.. నెల ముందే రాజీనామాలు
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సవాల్‌కు టీడీపీ నేతలు స్పందించారు. వైసీపీ కంటే నెల ముందే తమ ఎంపీలు, మంత్రులు రాజీనామా చేస్తారని రాష్ట్ర మంత్రి ఆదినారాయణ రెడ్డి తెగేసి చెప్పారు. పరిష్కారం లభించకపోతే.. కేంద్రం నుంచి బయటకొచ్చేస్తామని కుండబద్ధలు కొట్టారు. తమ డెడ్‌లైన్ మార్చి ఐదుగా ప్రకటించిన ఆయన.. వైసీపీ కంటే నెల ముందు రాజీనామాలు చేస్తామని.. అదే రోజు బీజేపీతో తెగతెంపులు ఉంటాయన్నారు.
అంతకు ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో మాట్లాడుతూ.. టీడీపీకి సవాల్ విసిరారు. హోదా కోసం జరిగే పోరాటంలో తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ ఆరు తమ డెడ్‌లైన్ అని.. ఆరోజు తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని.. అదే రోజు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే... దెబ్బకు కేంద్రం దిగివస్తుందన్నారు.
By sources
Comments
Post a Comment