ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ హోదాను భారతదేశం మరోసారి సొంతం చేసుకుంది.
ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ హోదాను భారతదేశం మరోసారి సొంతం చేసుకుంది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.2 శాతంగా నమోదైంది. మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టర్లలో వృద్ధి పుంజుకోవడంతో ఇది సాధ్యమైంది. 2016-17 జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో నమోదైన జీడీపీ వృద్ధి రేటు కన్నా ఇది అత్యధికం కావడం విశేషం. ఈ వివరాలను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది.
రాయిటర్స్ నిర్వహించిన అధ్యయనంలో అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 6.9 శాతంగా నమోదు కావచ్చునని అంచనా వేశారు. ఈ అధ్యయనంలో 35 మంది ఆర్థికవేత్తలు పాల్గొన్నారు.
మరొక విశేషం ఏమిటంటే, అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 6.8 శాతం మాత్రమే.
పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు ఫలితంగా భారతదేశ జీడీపీ వృద్ధి రేటు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 5.7 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో ఇది 6.5 శాతానికి పెరిగింది.
Comments
Post a Comment