ఢిల్లీ సీఎస్‌పై దాడి కేసు... మెడికల్ సర్టిఫికేట్ ఏం చెబుతోంది?

ఢిల్లీ సీఎస్‌పై దాడి కేసు... మెడికల్ సర్టిఫికేట్ ఏం చెబుతోంది?

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల దాడి కేసులో మెడికో లీగల్ సర్టిఫికేట్ (ఎంఎల్‌సీ) నివేదిక పోలీసులకు చేరింది. అరుణ అసఫ్ అలీ ఆసుపత్రి వైద్యులు ఆయనను మంగళవారం ఉదయం పరీక్షించారు. అన్షు ముఖం చుట్టూ గాయాలు ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. నుదుటి కుడివైపు గాయం గుర్తులు ఉన్నాయని తెలిపారు. రెండు చెవుల వెనుక వాచిపోయిందన్నారు. పెదవుల వద్ద గాయాలు, కుడి బుగ్గపై వాచిన గుర్తులు ఉన్నాయన్నారు.
 
అన్షుపై సీఎం కేజ్రీవాల్ నివాసంలో సోమవారం రాత్రి దాడి జరిగినట్లు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ జామియా నగర్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఉదయం లొంగిపోయారు.
By sources 

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!