*మజ్లిస్ ఎమ్మెల్యే అండతో ప్రభుత్వ ఆస్తులు హాంఫట్…!*

*మజ్లిస్ ఎమ్మెల్యే అండతో ప్రభుత్వ ఆస్తులు హాంఫట్…!* 

మజ్లిస్ అనగానే కేసీయార్ అత్యంత, అలవిమాలిన ప్రేమను చూపిస్తున్నాడు… మజ్లిస్ ఏది చెప్పినా… టేకిట్ ఫర్ గ్రాంట్ అన్నట్టుగా తలూపుతున్నాడు… అది మజ్లిస్ ప్రజాప్రతినిధులు చెలరేగిపోయేలా చేస్తున్నది… 

భూఆక్రమణలు, చట్టవ్యతిరేకంగా నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగిపోతున్నాయి… ఒక ఉదాహరణ…

*మల్కపేట్, సైదాబాద్ మెయిన్ రోడ్డులో ప్రభుత్వ భూమి అది… మెయిన్ రోడ్డుపైనే… కొన్ని కోట్ల ప్రాపర్టీ… నిజానికి అది ప్రభుత్వ మిగులు భూమి… ఎవరో మజ్లిస్ ఎమ్మెల్యే అండతో ఎవరో అందులో ఏకంగా అయిదంతస్థుల భవనమే కట్టడం స్టార్ట్ చేశాడు…* రెవిన్యూ శాఖ నోటీసులు ఇచ్చింది… కోర్టు కూడా అది ప్రభుత్వ భూమే అని చెప్పింది… సో వాట్..? నిర్మాణం ఆగితే కదా… ఇది మనం చెప్పినట్టు వినే ప్రభుత్వం… అంతే… ఎవరినీ ఖాతరు చేయకుండా కట్టేయసాగారు… ఈరోజు ఎంఆర్ఐ కే.మాధవి నేతృత్వంలో అధికారులు వెళ్లి ‘ఇది తెలంగాణ ప్రభుత్వ ఆస్తి’ అని ఆ గేటుపైన రాయించారు… సదరు నిర్మాణకర్తలు లైట్ తీసుకున్నట్టే కనిపించారు… ఇక్కడ ప్రభుత్వం యాక్ట్ చేస్తున్నది ఇప్పటికయితే… కానీ ఇలాంటివి ఎన్ని..? 

కేటీయార్ గత గ్రేటర్ ఎన్నికల్లో చెప్పిన విశ్వనగరం ముచ్చట్లు…. కేసీయార్ ప్రవచించిన అద్భుతమైన అభివృద్ధి సంగతులు… వాటి సంగతేమో గానీ… ఒక్కో కార్పొరేటర్ నెలకు ఇంత టార్గెట్ అని పెట్టుకుని మరీ రెచ్చిపోతున్నారు… జనం వెర్రిచూపులు చూసేంతగా..! 

By sources

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!