కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ కి ఎందుకు డబ్బులు ఇవ్వలేదు అని అందరూ అడుగుతున్నారు.

కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ కి ఎందుకు డబ్బులు ఇవ్వలేదు అని అందరూ అడుగుతున్నారు. 

విషయం ఏమిటి అంటే కేంద్ర ప్రభుత్వం మన వాళ్ళు పోగానే, ఇదిగో ఇక్కడ ఈ వోచర్ మీద సంతకం పెట్టండి, ఆ పెట్టె లో లక్ష కోట్లు ఉన్నాయి పట్టుకు పోయి ఇష్టం వచ్చినట్టు వాడుకోండి, అయిపోయాక వస్తే మళ్ళీ ఇస్తా అనడానికి అదేమన్నా పిల్లని ఇచ్చిన మామ కాదు. 

కేంద్రానికి వచ్చే ఆదాయం లో నలభై రెండు పర్సెంట్ అన్ని రాష్ట్రాలకి పంచుతారు. అది కాక ఆదాయం తక్కువ ఉన్న దరిద్ర రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, యుపి, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకి ఐదేళ్ళు పాటు సంవత్సరానికి ఇంత అని పంచుతారు. నాకు గుర్తు ఉన్నంత వరకూ అది ఇరవై వేల కోట్లు. 

కాని కేంద్రం అలా విచ్చల విడి గా కాష్ ఇవ్వదు. మీరు ఏమన్నా ప్రాజెక్ట్ తీసుకుని దాని రిపోర్ట్ తయారి చేసి తీసుకెళితే వాళ్ళు దాని లో సగమో, ముప్పాతికో ఇస్తారు, బెంగుళూరు మెట్రో కి ముప్ఫై నాలుగు వేల కోట్ల తో ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే, కేంద్రం సగం ఇవ్వడానికి ఒప్పుకున్నది. అదీ మొదటి రోజే ఇవ్వరు, పని నడుస్తూ ఉంటే ఇస్తూ ఉంటారు. హైదరాబాద్ మెట్రో కి కూడా ఐదు వేల కోట్లు విజిఎఫ్ కేంద్రం వన్ టైం కాష్ సెటిల్మెంట్ ఇచ్చింది. కలకత్తా మెత్రో కి 7500 కోట్లు ఇచ్చారు. అలా అన్ని రాష్ట్రాలకి ఇస్తారు. 

అంతే కాని తిరుపతి లడ్డు ఇచ్చి, శాలువా కప్పితే డబ్బులు ఇవ్వడం నాకు తెలిసి కుదరదు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!