తెలుగు రాష్ట్రాలకు శుభవార్త చెప్పిన కేంద్రం కేటాయింపుల పూర్తి వివరాలు

తెలుగు రాష్ట్రాలకు శుభవార్త చెప్పిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2018-19లో తెలుగు రాష్ట్రాలకు మొండిచెయి చూపించిన విషయం తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో గల్లీ మొదలుకుని ఢిల్లీ వరకు ఎంపీలు నిరసనలు తెలుపుతూ హోరెత్తించారు. అయితే తాజాగా రైల్వేబడ్జెట్‌‌లో తెలుగు రాష్ట్రాలకు చిన్నపాటి శుభవార్తను అందించింది కేంద్రం. మంగళవారం రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
 
కేటాయింపుల పూర్తి వివరాలు..
ఏపీ- రూ.3,670 కోట్లు, తెలంగాణకు రూ.1,813 కోట్ల కేటాయింపులు జరిగాయి. గత ఏడాది కంటే తెలంగాణకు అదనంగా రూ.84 కోట్లు, ఏపీకి అదనంగా రూ.264 కోట్లు కేటాయింపులు జరిపినట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
 
ఇరు రాష్ట్రాల్లో విద్యుద్దీకరణ లైన్లకు రూ.1,261 కోట్లు
ఇరు రాష్ట్రాల్లో ఆర్‌యూబీ, ఆర్‌వోబీలకు రూ.400 కోట్లు
అక్కన్నపేట్- మెదక్‌ లైన్‌కు రూ.130 కోట్లు
ఓబులవారిపల్లి-కృష్ణపట్నం లైన్‌కు రూ.200కోట్లు
గుంటూరు- తెనాలి డబ్లింగ్ కోసం రూ. 40 కోట్లు
నడికుడి- శ్రీకాళహస్తి లైన్‌కి రూ.420కోట్లు
 
విజయవాడ- అమరావతి-గుంటూరు ప్రాజెక్టుకు రూ.10కోట్లు
కడప- బెంగళూరు ప్రాజెక్టు కోసం రూ.175కోట్లు
కోటిపల్లి- నర్సాపూర్ లైన్‌కు రూ.200కోట్లు
విజయవాడ-గూడూరు మూడవ లైన్‌కు రూ.250 కోట్లు
ఘట్‌కేసర్‌-యాదాద్రి ఎంఎంటీఎస్-2కు రూ. 21.25కోట్లు
 
రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ..
ఫండ్స్ కేటాయింపుల కోసం జీఎంలకు అధికారం కేటాయించామన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎంఎంటీస్ పొడగింపుపై సివిల్ ఏవియేషన్‌తో చర్చలు జరుపుతున్నామని రైల్వే జీఎం స్పష్టం చేశారు. సికింద్రాబాద్, విజయవాడ స్టేషన్ల అభివృద్ధి కోసం బిడ్లకు స్పందన లేదన్నారు. లీజుకాలాన్ని 45 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు పెంచుతూ రైల్వేబోర్డు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. రైల్వేస్టేషన్ల అభివృద్ధి కోసం ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేసినట్లు రైల్వే జీఎం వినోద్ వివరించారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!