సోషల్ మీడియాలో మరోసారి నవ్వులపాలైన కాంగ్రెస్
అధికార పక్షాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేయాలన్న కంగారులో కాంగ్రెస్ సోషల్ మీడియాలో తప్పటడుగులు వేస్తోంది.
గతంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అవినీతి అంశంలో ట్విట్టర్లో నిర్వహించిన వోటింగ్ బెడిసికొట్టిన విషయం తెలిసిందే. అంతకు ముందు వీలైనన్ని ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకోమంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా అధ్యక్షురాలు ఇచ్చిన స్టేట్మెంట్ తాలూకు వీడియో వల్ల నవ్వులపాలైన కాంగ్రెస్ తాజాగా మరోసారి ఇబ్బందుల్లో పడింది.
ఈసారి మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రసారం చేసిన తప్పుడు కధనాల కారణంగా తప్పులో కాలేసింది. విషయానికి వస్తే.. టెలికామ్ శాఖ దేశంలోని మెషిన్-టూ-మెషిన్ వినియోగం కోసం 13 అంకెల నెంబరును వినియోగదారులకు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇవి ఆటోమేషన్ విధానంలో పనిచేసే ఇంటర్నెట్ ఆధారిత యంత్రాల కోసం ఉద్దేశించినవి మాత్రమే. అంటే సెన్సార్లు, స్వైపింగ్ మెషిన్లు, స్మార్ట్ గ్రిడ్లు, ఆటోమేషన్ గృహోపకరణాలకు అన్నమాట. సాధారణ 10 అంకెల మొబైల్ నెంబర్లకు వర్తించదు. 10 మొబైల్ నెంబర్లు యథాతథంగానే ఉంటాయి. ఈ అంశాన్ని టెలికాం శాఖ విస్పష్టంగా చెప్పింది.
ఐతే మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం ఆ వార్తను త్వరగా ప్రసారం చేయాలనే తొందరలో అత్యుత్సాహం ప్రదర్శించింది. ఇక 10 అంకెల మొబైల్ నెంబర్లకు కాలం చెల్లిపోయిందనీ, వినియోగదారులందరూ కచ్చితంగా 13 అంకెల నెంబర్లకు మారాల్సిందేనని, ఇక కష్టాలు తప్పవని తప్పుడు వార్తలు ప్రచారం చేసింది.
టెలికాం శాఖ జారీ చేసిన ఆధారాలు చదవకుండా మీడియా ప్రసారం చేసిన తప్పుడు వార్తలనే నిజం అనుకున్న కాంగ్రెస్ వాటి ఆధారంగా ట్విట్టర్లో ఈ అంశంపై పోలింగ్ నిర్వహించింది. “టెలికాం డిపార్ట్మెంట్ దేశంలోని టెలికాం ఆపరేటర్లందరినీ 13 అంకెల నెంబర్ వాడమని ఇచ్చిన ఆదేశాల పట్ల మీరు ఆనందంగా ఉన్నారా” అనేది వోటింగ్ ప్రశ్న. ప్రభుత్వ ఆదేశాలు సక్రమంగా చదవకుండా తప్పుడు వార్తలపై ఆధారపడి నిర్వహించిన వోటింగ్ తాలూకు పోస్టులో అకౌంట్ హోల్డర్లు దుమ్మెత్తిపోశారు.
నిజానికి కాంగ్రెస్‌కు ఇలా బోల్తా పడడం ఇదే తొలిసారి కాదు. గతంలో రాజా రామ్మోహన్ రాయ్ వర్ధంతి రోజున తేదీలు అటు ఇటూ వేసి పొరపాటు చేసింది. 27 సెప్టెంబర్ 1833లో జన్మించి 22 మే 1772లో మరణించినట్టు ట్వీట్ చేసింది. నిజానికి అది ఎవరికీ సాధ్యంకాని పని.
తన తప్పు గ్రహించుకుని ఆ ట్వీట్ డిలీట్ చేసినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగి
By sources
Comments
Post a Comment