రేణుకాచౌదరిపై ప్రధాని మోదీ సెటైర్లు
రేణుకాచౌదరిపై ప్రధాని మోదీ సెటైర్లు
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ కాంగ్రెస్ అరాచకాలపై లోక్‌సభలో ఉద్వేగ ప్రసంగం చేసిన ప్రధాని మోదీ రాజ్యసభలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. స్వాతంత్ర్యం తర్వాత దేశానికి కాంగ్రెస్ అవసరం లేదని మహాత్మాగాంధీయే చెప్పారని, కాంగ్రెస్ లేని భారత్ నినాదం తనది కాదని.. గాంధీజీదేనని మోదీ వ్యాఖ్యానించారు.
మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు పెదవి విరవడంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు వారిని వారించారు. ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లాలంటూ ఎంపీ రేణుకా చౌదరికి చురకలంటించారు. అనంతరం మోదీ ప్రసంగం వింటూ రేణుకా చౌదరి పెద్దగా నవ్వడంతో.. ప్రధాని స్పందిస్తూ ‘‘అప్పట్లో రామాయణం సీరియల్‌లో అలాంటి నవ్వులు విన్నాం.. ఇప్పుడు మరోసారి వింటున్నాం.’’ అంటూ సెటైర్ వేశారు. మోదీ అలా అనడంతో బీజేపీ ఎంపీలంతా బల్లలు చరుస్తూ నవ్వుకున్నారు.
Comments
Post a Comment