ముఖేష్ అంబాని సొదరుడు విపుల్ అంబానిని అరెస్టు చేసిన CBI. ఏందుకొ తెలుసా ???

దేశంలొనే అత్యంత ధనవంతుడు, ప్రపంచంలొని #Top_10 ఐశ్యర్యవంతులలలొ ఒకరైన రిలయన్స్ సామ్రాజ్యాధినేత ముఖేష్ అంబాని సొదరుడైన విపుల్ అంబాని (కజిన్) ని CBI  నిన్న అరెస్టు చేసింది.

దేశంలొ సంచలనం సృష్టంచిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం లొ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన CBI …. ఈ స్కాంలొ లొని కీలక నిందితుడైన నీరవ్ మోది అనుబంధ సంస్థ అయిన “ఫైర్ స్టార్ ఇంటర్నేషనల్” కంపెనీ “చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్” (CFO) అయిన ముఖేష్ అంబానీ సొదరుడు విఫుల్ అంబానీని CBI అరెస్టు చేసింది. విఫుల్ అంబానీ స్వయానా ముఖేష్ అంబానీ తండ్రి ధీరూబాయ్ అంబానీ సొదరుడైన నాతూభాయ్ అంబానీ కుమారుడు.

.



.

అంతేకాకుండా ఈ కేసులొ విపుల్ అంబానీతొ పాటు “పైర్ స్టార్” గ్రూఫ్ డైరక్టర్లయిన కవితా మంకికర్, అర్జున్ పాటిల్ లను కూడా CBI  అరెస్టు చేయడం విశేషం. ఇప్పటికే ఈ కేసులొ గీతాంజలి గ్రూఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ కపిల్ ఖండే, గీతాంజలి గ్రూఫ్ మేనేజర్ నితిన్ షాహి లను CBI  అరెస్టు చేసింది. వీరిరువురికీ మరొక వజ్రాల వ్యాపార సంస్థ అయిన నక్షత్ర గ్రూఫ్ తొ కూడా సంబందాలున్నట్టు తెలుస్తుంది.

వీరితొ పాటుగా వీరికి సహకరించిన పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులైన బిచ్చు తివారి, యశ్వంత్ జొషి, ప్రఫుల్ సావంత్ లను CBI  సొమవారం నాడు అరెస్టు చేసింది. అయితే ఈ స్కాం లొ ప్రధాన నిందితుడైన నీరవ్ మోది, దుబాయ్ లొ ఉన్నట్టు తెలియడంతొ , అతనిని భారత్ కు రప్పించడానికి CBI,  ఇంటర్ పొల్ సహాయం తీసుకుంటుంది
By sources

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!