#IAmWithModi

#IAmWithModi 

గట్టిగా ఒక కష్టం వస్తే తలుపులు బిడాయించుకుని కుళ్ళి కుళ్ళి బాధపడే మానసిక స్థాయి మనది..

ఎన్ని శక్తులు,ఎన్ని కుయుక్తులు,ఎన్ని విభజన వాదాలు,ఎన్ని ఓట్ల రాజకీయాలు ఎదురవ్వని, ఏకమవ్వని..అకుంఠిత దీక్ష,దేశం పట్ల మొక్కవోని అంకిత భావానికి నిలువెత్తు రూపం... మోడీ

కాల చక్రం నీకు నాకు అలుపిస్తుందేమో ఆయనకి మరింత శక్తినిస్తుంది,ప్రతీ సవాల్ ఆయనకి మరింత ఉత్తేజం ఇస్తుంది...కాలం చెక్కిన శిల్పం మోడీ

అవహేళనలు,అవమానాలు మనల్ని కుంగదీస్తాయి, కుదేలు చేస్తాయి..ఆత్మీయులు బాధపడి ఎందుకు నీకు ఇవన్నీ అనేలా చేస్తాయి..అవే ఆయనకి మెట్లు అవుతాయి,సమున్నత స్థానానికి,శిఖరానికి.. అదే మోడీ

నా కుటుంబం,నా పరిమితులు మనవి.. విశ్వమానవ కుటుంబం తనది..ఇజ్రాయెల్ ని,పాలస్తీనాని సమానంగా చూడగలిగే సార్వజనీయ నాయకత్వం మోడీ

మనకో పదివేలు కలిసొస్తేనే దేశం,లేకపోతే ఏంటండి ఈ అరాచకం అని మాట్లాడే అసమతుల్య ఆలోచన విధానం మనది...దేశం మిన్న,దేశమే మిన్న అన్న స్ఫూర్తి మోడీ..

అందుకే రానీ..రానీ..వస్తే రానీ..కష్టాల్, నష్టాల్..కోపాల్..తాపాల్..రానీ ..

పోనీ..పోనీ..పోతేపోనీ హితుల్,మితృల్..పోనీ..నేను నీ వెనుకే #IAmWithYouModi

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!