RSS ....అంటే ????

RSS ....అంటే  ????

RSS = రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఏంటనీ?...చాలామందికి తెలియవలసిన విషయాలు.
కుల, జాతి, వర్గ విభేదాలు ,వైషమ్యాలు లేకుండా ఒకే భగవద్వజం నీడ క్రింద ,నిజమైన దేశభక్తులను తయారు చేసే పరిశ్రమ ఈ సంఘ శాఖ . 

ఈ సంఘశాఖలో ప్రతిదినము జరిగే కార్యక్రమములు ...
ధ్వజారోహణము / ధ్వజప్రణామము .. 
సూర్యనమస్కారముల ఆసనములు .. 
శారీరక వ్యాయమదండ ప్రహరణలు .. 
యోగ / ఆసనములు .. క్రీడలు /ఆటలు .. 
ముఖ్య సమాజహిత సూచనలు .. 
భక్తి భావపూరిత సంబంధిత పురాణపురుషుల వీరగాధలు/ కధలు .. 
గీతాలాపన / వక్త ప్రసంగములు .. ఒకరితో మరొకరి సత్సంబంధములు పెంచుకోవడము .. ప్రార్ధన /ధ్వజావరోహణము ఉంటాయి.  

పండుగలు మరియు కొన్ని శుభసందర్బములలో ప్రత్యేక కార్యక్రమములుంటాయి .

ఆర్ఎస్ఎస్ గురించి తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యవిషయాలు ..!
************************************************************
ఆర్ఎస్ఎస్ అంటే చాలు బారతదేశంలో ఓ సంచలనం. రాజకీయ పార్టీలు ఎప్పుడూ మాట్లాడుకునే మాటల్లో RSS  ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా ఉంటుంది. 1925 సెప్టెంబర్ 25న డాక్టర కేశవ్ బలిరామ్ హెగ్డేవర్ స్థాపించిన ఈ సంస్థ దినదిన ప్రవర్దమానంగా పెరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్గనైజేషన్ గా పేరుపొందింది. భారతమాత కోసం పని చెయ్యాలనుకొనే, దేశం అంటే అభిమానం ఉన్న వాళ్లు ఎవరైనా ఈ సంస్థలో చేరవచ్చు. అందరం కలిసి దేశం కోసం మనం అన్న కోణంలో పుట్టుకొచ్చిందే RSS . దేశాభిమానం ఉన్న వాళ్లు ఎవరైనా కూడా ఇందులో చేరవచ్చు కానీ ప్రపంచానికి ఎంతో పరిచయమున్న ఆర్ఎస్ఎస్ గురించి మీకు తెలియని చాలా కొన్ని నిజాలు...

1. ఆర్ఎస్ఎస్ కు మనదేశంలో అనునిత్యం జరిగేవి 65 వేలు శాఖలు ఉన్నాయి . ఈ సంస్థను నడుపుతున్నవారు కూడా అందులోని సభ్యులే. భగ్వధ్వజ(కాషాయం జెండా) ఆర్ఎస్ఎస్ లో అధినాయకత్వం. ఇక్కడ వ్యక్తి పూజ లుండవు . ఆర్ఎస్ఎస్ లో ఉండే వాళ్లు కూడా "ఈ జెండానే గౌరవిస్తారు". ప్రపంచంలోనే అతి పెద్ద సంఖ్యలో సేవకులు (వాలంటీర్లు) ఉన్న సంస్థ ఆర్ఎస్ఎస్. దాదాపు 60లక్షల మంది వాలంటీర్లతో ఎంతో మంది అభిమానులతో ఆర్ఎస్ఎస్ ఘననీయమైన సేవలను అందిస్తోంది...

2.ఆర్ఎస్ఎస్ సభ్యత్వం తీసుకున్నా కానీ ఎవరికీ గుర్తింపు కార్డు(ఐడెంటిటి కార్డ్) కానీ బిజినెస్ కార్డ్ కానీ ఇవ్వరు. కేవలం భారతమాతకు సేవ చెయ్యాలని అనుకున్న వారు ఎవరైనా ఈ సంస్థలో చేరవచ్చు. .

3. ఆర్ఎస్ఎస్ రాజకీయేతర సంస్థ. కానీ మోదీ, వాజ్ పేయి, అడ్వానీ లాంటి బిజెపి నాయకులు మాత్రం ఆర్ఎస్ఎస్ నుండి వచ్చిన వాళ్లు. అయితే చాలా మంది బిజెపి పార్టీలో ఆర్ఎస్ఎస్ భాగం అని అనుకుంటారు. ఒక్క బిజెపి పార్టీలోనే కాదు కాంగ్రెస్, ఆప్/కేజరీవాల్  పార్టీలలో కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుండి వచ్చిన వాళ్లు చాలా మందే ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ధ్యేయం ఒక్కటే యువత వ్యక్తిత్వాన్ని మలిచడం ద్వారా దేశ నిర్మాణంలో పాలుపంచుకోవడం...

4.ఇండో చైనా యుద్దం జరిగే సమయంలో దేశ భ్రదతకు అందరు సరిహద్దుల వద్ద యుద్దంలో ఉంటే అప్పుడు దేశ రక్షణకు ఆర్ఎస్ఎస్ సంస్థ ముందుకు వచ్చింది. వేల మంది ఆర్ఎస్ఎస్ సేవకులు యుద్దసమయంలో సేవాకార్యక్రమంలో పాల్గొన్నారు. ఎప్పుడు దేశంలో సంక్షోభం వచ్చిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముందుంటారు...

5. ఆర్ఎస్ఎస్ అనేది ముస్లింలకో లేదా క్రిస్టియన్ లకో వ్యతిరేకం కాదు. దేశమంటే గౌరవం అభిమానం ఉండి సేవ చెయ్యడానికి సిద్దంగా ఉన్న వాళ్లు ఎవరైనా ఆర్ఎస్ఎస్ లో చేరవచ్చు. మన సంస్రృతి సంప్రదాయాలను కాపాడేందుకు, దేశ రక్షణకు ఆర్ఎస్ఎస్ కట్టుబడి ఉంటుంది...

6. ఆర్ఎస్ఎస్ లో కేవలం మగ వారికే కాదు మహిళలకు కూడా స్థానం ఉంది. "రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్" అని పురుషుల కోసం విబాగం ఉంటే, మహిళల కోసం "రాష్ట్రీయ సేవికా సమితి " అని ప్రత్యేక విభాగం ఉంది. కానీ రెండింటి లక్ష్యం మాత్రం ఒక్కటే...

7.సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎన్నడూ కూడా ఆర్ఎస్ఎస్ ను విభేదించలేదు. కానీ 1948లో మాత్రం రాజకీయ వత్తిడిల నేపథ్యంలో కొన్నాళ్లు ఆర్ఎస్ఎస్ పై నిషేదం విధించారు. కానీ తర్వాత ఆ నిషేదాన్ని ఎత్తివేశారు. అయితే నిషేదం ఎత్తివేసిన తర్వాత సంతోషించే మొదటి వ్యక్తిని నేనే అంటూ ఆర్ఎస్ఎస్ గురించి లేఖ రాశారు...

8. అతికొద్దిమంది మంది మహాత్మా గాంధీని చంపించింది ఆర్ఎసఎస్ అని ఆరోయిస్తుంటారు . కానీ నాధూరామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ లో వాలంటీర్ గా కొనసాగి, 1930లోనే ఆర్ఎస్ఎస్ నుండి బయటకు వెళ్లిపోయారు. మహాత్మా గాంధీ హత్య జరిగినప్పుడు నాధూరామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ 
లో లేరు,ఎవరిసొంత అభిప్రాయాలు వారికుంటాయి కొందరు అవలంబించే పద్ధతులు నచ్చక,వారి మనస్సు ఏది చెబితే దానికి తలవంచి విధి వంచితులవుతుంటారు.

9.జాతీయ ఉదార భావాలున్న ఆర్ఎస్ఎస్ ను మహాత్మాగాంధీ మరియు డాక్టర్ అంబెడ్కర్ గార్లు ఎంతో అభిమానించే వారు. 1963 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆర్ఎస్ఎస్ పరేడ్(కవాతు) నిర్వహించారు.దాదాపు 3500 మంది ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు ఎర్రకోట సాక్షిగా రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొన్నారు...

ఈ హిందూ దేశంలో పుట్టిన ప్రతీ భారతీయుడు ముఖ్యంగా హిందువు అనీ పివబడే ప్రతీ  ఒక్కడూ... పుట్టినప్పటి నుండీ మరణించేవరకూ "తిన్నామా- పడుకున్నామా- తెల్లారిందా" అనీ అనుకోకుండా... ఈ దేశం నాకేమిచ్చింది అనీ కాకుండా  "ఈ దేశంకోసం మనమేమిచ్చాము" అని మనసున ప్రతీ ఒక్కరూ  తలంచాలి.కొన్ని దుష్ట ఆధునీక మతాల వలన మన సంస్కృతీ ఆచార వ్యవహార సాంప్రదాయాలపై  నేటి సమాజంపై పిల్లలపై ఎంతో ప్రమాదకరమైన దుష్ప్రభావాలు దాడి చేస్తున్నాయి దీని కారణముగా దేశభక్తి క్రమేపీ నశిస్తుంది .    
ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో చిన్నప్పటి నుండే మీ పిల్లలను చేర్పించండి మంచి అలవాట్లు అందించండి ,మరణానికి చేరువగా ఉన్న వయసు పైబడినవారు కూడా కొన్ని లక్షలమంది ప్రతీరోజూ ఈ సంఘ శాఖలో తరిస్తున్నారు .

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!