2019 ,సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో దేశవ్యాప్తంగా KCR ప్రభంజనాన్ని చూసి దేశప్రజలు అన్ని రాష్ట్రాల్లో ఆనందోత్సాహాలలో మునిగిపోయారు..... ఏ రాష్ట్రంలో చూసినా బ్రతుకమ్మలు , ధూంధాం లే.......!!!

2019 ,సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో దేశవ్యాప్తంగా KCR ప్రభంజనాన్ని  చూసి దేశప్రజలు అన్ని రాష్ట్రాల్లో ఆనందోత్సాహాలలో మునిగిపోయారు..... ఏ రాష్ట్రంలో చూసినా బ్రతుకమ్మలు , ధూంధాం లే.......!!!
   కేవలం 4సంవత్సరాల్లోనే బికారీ చేయబడ్డ తెలంగాణా రైతులందరినీ కోటీశ్వరులుగా మార్చి , అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ ను 5 లక్షల కోట్ల మిగులుతో ప్రపంచ బ్యాంకు కే అప్పు ఇస్తున్న మహపురుషుడైన KCR  ప్రధాని గా ఉండాలని కోరుకోని వారు ఎవరుంటారు చెప్పండీ......!!!. 
   అందుకే  అన్ని రాష్ట్రాల్లోనూ *KCR* ను తప్ప ఎవరినీ ప్రధాని గా ఒప్పుకునేది లేదని  పిల్లా , జెల్లా ముసలీ ముతక అనకుండా ఊరేగింపులు , నిరాహారదీక్షలు......
  Secular కూటమి నాయకులైన మమతా, కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్, మాయా , ములాయం ,లాలూ ,దేవెగౌడ ,ఏచూరీ లాంటి  వారు ఒకటే బ్రతిమిలాట........ కానీ , *KCR మాత్రం దళితున్ని ప్రధానిని చేస్తానన్న తన మాటకే కట్టుబడి ఉంటానని మొండిపట్టు పట్టారు.*..... 
 *చివరికి నలుగురు వచ్చి నిమ్మరసం తాగించడంతో పట్టువిడిచి ప్రధాని పదవిని  అంగీకరించి దేశాన్ని పెద్ద ప్రమాధం నుంచి  కాపాడారు.*...... అయినా ప్రతి రాష్ట్రానికి  (  తెలంగాణ తప్ప ) ముస్లింలను ముఖ్యమంత్రులు గా , చేయాలన్న తన నిర్ణయంలో మార్పలేదనీ ప్రకటించారు......
  *కేంద్ర కేబినెట్ లో OWAISI ని రక్షణ, హోం శాఖమంత్రిగా చేసి పాకిస్థాన్ కు ఏమాత్రం పనిలేకుండా చేసిన తీరుకు చైనా , బాంగ్లదేశ్ లు సంతోషం వ్యక్తం చేశాయి.*..... 
   బ్యాంకు లన్నీ మూత పడ్డా , ఒక్క KCIB ( Kalvakunta Compound Interest Bank )ని మాత్రం విజయపథంలో నడిపిస్తున్న *కేంద్ర ఆర్థికమంత్రి  శ్రీమతి కవిత గారు మాత్రం* దేశ విదేశ ఆర్థికవేత్తల నుండి ప్రశంసలు అందుకుంటున్నారు......
   
      ★★★★★

   *ప్రపంచ దేశాధి నేతల ఆంధోళన* 

   అందరికీ నాయకత్వం వహించగల్గిన  *మోడీ*
గారినే 6నెలల్లో  చిత్తు చేసిన *KCR* ను చూస్తే ప్రపంచ దేశాల నాయకుల్లో వణుకు మొదలైందనడానికి వాళ్ళ ఈ క్రింది Statement లే నిదర్శనం..... 
  
★  వామ్మో.....!!!
 బతికి పోయాం మనం ఇంకొక్క 70 సంవత్సరాలు స్వాతంత్ర్యం ఇవ్వడం ఆలస్యం చేసుంటే KCR మనల్ని బతుకమ్మ లాడిచ్చెటోడు ______
    *England PM*
  
  ★ KCR ను ఎదుర్కోవాలంటే
 యూరోప్, ఆసియా దేశాల్లోని అందరం ఐక్యం కావల్సిన అవసరముంది._______ *Germany VC*
    
 ★ KCR తెలంగాణ Development గురించి  మా ప్రజలకు చెప్పి మా పొట్ట కొట్టకుండా ఉండడానికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ______ *US, President*
    
   ★ మేమింత కష్టపడ్డా జరుగని అభివృద్ధి KCR  సంవత్సరానికి ఒకసారి కూడా Secretariat కు పోకుండా , Files చూడకుండా ఎలా అధ్భుత ప్రగతి సాధించారో... అంతుచిక్కకుండా ఉంది _________ *JAPAN PM* 
    
★ ఇంత గొప్ప Dedication, Discipline, Hard Working Nature గల నాయకుడుండడం India చేసుకున్న అధృష్టం...... ఇలాంటి వారు పుట్టడం Very Rare...... ఇతని Hard Work అందుకోకుంటే మనకు పుట్ట గతులుండవు. ________ *UNO లో Majority సభ్యులు*

మత్తు దిగి (ఉదయాన్నే 11గంటలకే నిద్ర లేవడంతో ) బంగారం లాంటి కల చెదిరి బాధపడుతున్న *KCR* ను ఊరడిస్తున్న వీరాభిమానులు......
     ★★★★★
   🔏🔏🔏  By KeshaboinaSridhar

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!