బీసీసీఐ సంచలన నిర్ణయం.. మహ్మద్ షమీపై వేటు!
బీసీసీఐ సంచలన నిర్ణయం.. మహ్మద్ షమీపై వేటు!
టీం ఇండియా బౌలర్ మహ్మద్ షమీపై బీసీసీఐ వేటు వేసింది. తాజాగా టీం ఇండియా ఆటగాళ్ల వేతనాలు పెంచుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కానీ ప్రకటించిన ఒప్పంద ఆటగాళ్ల జాబితాలో షమీ పేరును బీసీసీఐ తొలగించింది. షమీకి దేశంలో ఎంతో మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని, అతనికి తన కంటే ముందే పాకిస్తాన్‌కు చెందిన మహిళతో వివాహం కూడా జరిగిందని షమీపై అతని భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై షమీ ఆ ఆరోపణలు అన్ని అబద్ధాలే అని వివరణ కూడా ఇచ్చాడు. కానీ అప్పటికే ఈ వార్త దేశ వ్యాప్తంగా సంచలనమైంది. షమీకి అక్రమ సంబంధంపై ప్రతి న్యూస్ ఛానల్‌లో కథనాలు ప్రసారం అయ్యాయి. దీంతో షమీని ఒప్పంద ఆటగాళ్ల జాబితాలో కొనసాగించడం వల్ల విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుందని భావించిన బీసీసీఐ అతని పేరును ఒప్పంద ఆటగాళ్ల జాబితాలోంచి తొలగించినట్లు సమాచారం. ఈ రోజు ప్రకటించిన వేతనాల పెంపు ప్రకారం ఏ+ కేటగిరీ ఆటగాళ్లకు రూ.7 కోట్లు, ఏ కేటగిరీ ఆటగాళ్లకు రూ.5 కోట్లు, బీ కేటగిరీ ఆటగాళ్లకు రూ.3 కోట్లు, సీ కేటగిరీ ఆటగాళ్లకు కోటి రూపాయిలు పెంచుతున్నట్లు బీసీసీఐ తెలిపింది.
By sources
Comments
Post a Comment