శూన్యం నుంచి శిఖరాన్ని చేరుకున్నాం.. కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవట్లేదు: ప్రధాని మోడీ
శూన్యం నుంచి శిఖరాన్ని చేరుకున్నాం.. కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవట్లేదు: ప్రధాని మోడీ
‘త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో ప్రజలు తమ తీర్పును ఇచ్చారు. భాజపా అభివృద్ధి అజెండాలో ఒకటైన ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’కి, మా కూటమి పార్టీలకు మద్దతిచ్చినందుకు ఈ రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక్కడి ప్రజల కోరికలు, ఆశయాలను నెరవేర్చేందుకు అహర్నిశలు పాటుపడుతాం.
త్రిపురలో విజయం సాధారణ ఎన్నికల విజయం కాదు. శూన్యం నుంచి శిఖరానికి చేరుకున్నాం. ఇందుకు అభివృద్ధి అజెండాలు ఎంతగానో దోహదం చేశాయి. దీన్ని సుసాధ్యం చేసేందుకు ఏళ్ల తరబడి శ్రమిస్తున్న ప్రతి భాజపా కార్యకర్తకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.
ఇది ప్రజాస్వామ్య విజయం. ఈ రోజు శాంతి, అహింస కలిసి భయాన్ని ఓడించాయి. త్రిపుర ప్రజలకు సరైన పాలన అందిస్తాం. మేఘాలయ, నాగాలాండ్‌లలోనూ భాజపాకు మద్దతిచ్చినందుకు సంతోషంగా ఉంది. వారందరికీ కృతజ్ఞతలు’ అని మోదీ ట్వీట్లలో పేర్కొన్నారు.
Comments
Post a Comment