పాకిస్థాన్ సెనేటర్‌గా హిందూ మహిళ

పాకిస్థాన్ సెనేటర్‌గా హిందూ మహిళ 
 
ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన కృష్ణ కుమారి కోహ్లి చరిత్ర సృష్టించారు. పాక్‌ సెనేట్‌కు ఎన్నికైన హిందూ మహిళగా రికార్డుల్లోకి ఎక్కారు. 39 ఏళ్ల కృష్ణ కుమారి.. బిలావల్‌ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) తరఫున సింధ్ ప్రావిన్స్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ సీటును మహిళలకు రిజర్వ్‌ చేశారు. పాక్‌లో మహిళల అభ్యున్నతి, మైనార్టీల హక్కుల సాధనలో కృష్ణ కుమారి గెలుపు ఓ మైలురాయిగా నిలిచిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పీపీపీ గతంలో హిందూ మహిళ అయిన రత్న భగవాన్‌ దాస్‌ను తొలిసారిగా సెనేటర్‌గా ఎన్నుకుంది.
కృష్ణకుమారి సింధ్ ప్రావిన్స్‌ థార్‌ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం నాగర్‌పర్కార్‌లో ఓ పేదకుటుంబంలో జన్మించారు.  ఆమె చిన్నప్పుడే కుటుంబంతో కలిసి మూడేళ్లపాటు జైలు జీవితం గడిపారు. 16 ఏళ్ల వయస్సులో లాల్‌చంద్‌ అనే వ్యక్తిని వివాహమాడారు. అప్పుడు ఆమె 9వ తరగతి చదువుతున్నారు. 2013లో సింధు యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో మాస్టర్స్‌ పూర్తిచేశారు. అనంతరం పీపీపీలో తన సోదరునితో కలిసి చేరారు. బెరానో యూనియన్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. థార్‌, ఇతర ప్రాంతాల్లో అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడి అందరి దృష్టిని ఆకర్షించారు.

52 మంది సెనేటర్ల పదవీకాలం ఈ నెలతో ముగిసిపోతుండటంతో వారి స్థానంలో కొత్తవారిని ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు నిర్వహించారు. నామినేటెడ్‌ సభ్యులతో కలిపి 130 మందికిపైగా ఈ ఎన్నికల్లో పోటీపడ్డారు.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!